సౌత్ సినిమా+ -

వీడియోలు+ -

వెబ్ స్టోరీస్+ -

వైరల్+ -

South Cinema: 'ది హాలీవుడ్ రిపోర్టర్ ఇండియా'.. కవర్ పేజీలో సౌత్ ఆధిపత్యం

ABN, Publish Date - Dec 19 , 2025 | 07:26 AM

ద హాలీవుడ్ రిపోర్టర్ ఇండియా తాజా కవర్‌లో బాసిల్ జోసెఫ్, కళ్యాణి ప్రియదర్శన్, ధ్రువ్ విక్రమ్, రుక్మిణి వసంత్ వంటి దక్షిణాది తారలు ఇండియన్ సినిమా స్వర్ణయుగానికి అద్దం పడుతున్నారు.

hollywood reporter

ప్రస్తుతం భారతీయ సినిమా (India Cinema) అంటే కేవలం బాలీవుడ్ (Bollywood) మాత్రమే కాదు. ప్రాంతీయ భాషల హద్దులు చెరిగిపోయి 'ఇండియన్ సినిమా'గా రూపాంతరం చెందింది. ఈ మార్పుకు అద్దం పడుతోంది ద హాలీవుడ్ రిపోర్టర్ ఇండియా (The Hollywood Reporter India) తాజా కవర్ పేజీ. ఈ కవర్ పేజీలో దక్షిణాది తారలు(South Indian stars) తమదైన ముద్ర వేస్తూ, అతిగా ప్రయత్నించకుండానే అందరి దృష్టిని ఆకర్షిస్తున్నారు.

ఈ కవర్ పేజీలో 'మరణమాస్' (Marana Mass) చిత్రంతో ఆకట్టుకున్న బాసిల్ జోసెఫ్ (Basil Joseph), ఒక ఆలోచనాత్మక నటుడికి ఉండాల్సిన ప్రశాంతతతో నిలిచారు. లోక (Loka) వంటి సక్సెస్‌ల తర్వాత కళ్యాణి ప్రియదర్శన్ (Kalyani Priyadarshan) లో కనిపిస్తున్న ఈజ్ (Ease) ప్రేక్షకులను కట్టిపడేస్తోంది.

వీరిద్దరితో పాటు చియాన్ విక్రమ్ (Chiyan Vikram) కుమారుడు ధ్రువ్ విక్రమ్ (Druvu Vikram).. చాలా ఇంటెన్స్‌గా, గ్రౌండెడ్‌గా కనిపిస్తున్నారు. కన్నడ చిత్ర పరిశ్రమకు దక్కిన తాజా సంచలనం రుక్మిణి వసంత్ (Rukmini Vasanth), తన క్లాసీ లుక్స్‌తో ఫ్రేమ్‌కి కొత్తదనాన్ని తీసుకొచ్చారు.

ఈ ఫోటో షూట్ కోసం దక్షిణాది తారలు ఎంచుకున్న దుస్తులు, మేకప్ కూడా చాలా రియలిస్టిక్ గా ఉన్నాయి. పురుషులు క్లీన్ టెయిలరింగ్ సూట్లలో, బ్లేజర్లలో రిలాక్స్డ్ కాన్ఫిడెన్స్ ప్రదర్శిస్తుంటే.. మహిళలు బ్లాక్ గౌన్లలో ఎంతో పవర్‌ ఫుల్ గా కనిపిస్తున్నారు. ఎవరూ కూడా ఇతరులను ఓవర్‌ షాడో (Overshadow) చేసేలా కాకుండా, అందరూ ఒకే శక్తివంతమైన టీమ్‌ గా నిలవడం విశేషం.

ఈ కవర్ పేజీ కేవలం సెలబ్రిటీల కలయిక మాత్రమే కాదు, అది ఒక 'చెక్ పాయింట్'. ఇందులో ఉన్న ప్రతి నటుడు ప్రస్తుతం ఎంతో బిజీగా, వరుస ప్రాజెక్టులతో దూసుకుపోతున్నారు.

బాలీవుడ్ నుంచి విక్కీ కౌశల్ (Vicky Kaushal) లవ్ అండ్ వార్ (Love and War) వంటి భారీ చిత్రాలతో సిద్ధమవుతుండగా, కృతి సనన్ (Kriti Sanon) తన సక్సెస్ గ్రాఫ్ ను కొనసాగిస్తున్నారు. అటు దక్షిణాది తారలు కూడా విభిన్న జోనర్లలో ప్రయోగాలు చేస్తూ, రిస్క్ తీసుకుంటూ భారతీయ సినిమాను ప్రపంచ స్థాయికి తీసుకెళ్తున్నారు.

ఒకప్పుడు ప్రాంతాల వారీగా విడిపోయిన సినీ పరిశ్రమలు, ఇప్పుడు ఒకే ఫ్రేమ్‌ లో కలిసిపోవడం భారతీయ సినిమా 'స్వర్ణయుగం' నడుస్తోందని చెప్పడానికి నిదర్శనం.

దక్షిణాది నటులు ఇప్పుడు కేవలం గెస్ట్ రోల్స్ కోసమో, చిన్న సినిమాల కోసమో కాదు.. ఫ్రేమ్‌ ను రూల్ చేయడానికి వస్తున్నారని సినీ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.

Updated Date - Dec 19 , 2025 | 07:26 AM