Keerthiswaran: రజనీకాంత్‌ను దృష్టిలో ఉంచుకుని.. 'డ్యూడ్'
ABN, Publish Date - Oct 06 , 2025 | 08:49 PM
ప్రదీప్ రంగనాథన్ హీరోగా నటించిన డ్యూడ్ చిత్రం స్టోరీ సూపర్ స్టార్ రజనీకాంత్ ను దృష్టిలో ఉంచుకుని రాశానని ఆ సినిమా దర్శకుడు కీర్తీశ్వరన్ వెల్లడించారు.
ప్రదీప్ రంగనాథన్ హీరోగా నటించిన డ్యూడ్ (DUDE) చిత్రం స్టోరీ సూపర్ స్టార్ రజనీకాంత్ (Rajinikanth) ను దృష్టిలో ఉంచుకుని రాశానని ఆ సినిమా దర్శకుడు కీర్తీశ్వరన్ (Keerthiswaran) వెల్లడించారు. దీపావళికి రిలీజ్ కానున్న చిత్రాల్లో 'డ్యూడ్' ఒకటి. ఈ నేపథ్యంలో దర్శకుడు కీర్తిశ్వరన్ ఇటీవల ఓ మీడియాతో మాట్లాడుతూ.. 'ఇది నాకు తొలి చిత్రం, 19 యేళ్ళ వయసులో ఇండస్ట్రీలోకి అడుగుపెట్టాను. ఇపుడు నా వయసు 27 యేళ్ళు, దర్శకురాలు సుధా కొంగర వద్ద అసి స్టెంట్(ఏడీ)గా పనిచేశాను.
ఈ సినిమా కథను ఫొటోగ్రాఫర్ నికేత్ బొమ్మి ద్వారా మైత్రీ మూవీ మేకర్స్ ( Mythri Movie Makers) నిర్మాతలకు వివరించాను. కథ విన్న వెంటనే వారు అంగీకంచారు. హీరోగా ప్రదీప్ రంగనాథన్ పేరు నేనే ప్రతిపాదన చేశా. 'డ్యూడ్' స్టోరీ ప్రారంభించినపుడు... రజనీకాంత్ 30 యేళ్ళ వయసులో ఉంటే ఈ కథలో ఎలా నటించే వారో అనే ఊహించుకుని ఈ స్టోరీ రాశాను. ప్రదీప్ రంగనాథన్ నా ఆలోచనలకు సరిపోయారు. పైగా ఈ స్టోరీ ప్రదీప్ కూడా ఎంతగానో ఇష్టపడ్డారు.
ఇందులో ప్రదీప్ రంగనాథన్ సరసన మమిత బైజు ( Mamitha Baiju) ను ఎంపిక చేశాం. అప్పటికి ఆమె నటించిన 'ప్రేమలు' సినిమా రిలీజ్ కాలేదు. 'సూపర్ శరణ్య' అనే సినిమా చూసి సెలెక్ట్ చేశాం. మమిత కథలోకి రావడంతో 'రజనీ శ్రీదేవి' కలిసి నటిస్తే ఎలా ఉంటుందో అలా ఈ సినిమా ఉంటుందని అనిపించింది. ఇందులో హీరో హీరోయిన్లు ఈవెంట్స్ మేనేజ్మెంట్ కంపెనీ నడుపుతుంటారు. వారి మధ్య ఏం జరిగిందన్నదే ఈ చిత్ర కథ.
సంగీత దర్శకుడిగా సాయి అభయంకర్ (Sai Abhyankkar) ను ఎంపిక చేయడానికి కారణం ఉంది. సంగీతంలో ప్రయోగాలకు అమితంగా ఇష్టపడతారు. నేను కూడా ఈ సినిమాలో సంగీతం కొత్తగా ఉండా అని భావించాను. అందుకే సాయిని ఎంపిక చేశాం, సీనియర్ నటులు శరత్ కుమార్, రోహిణి, 'పరితాపం గల్ పేం డేవిడ్ ప్రధాన పాత్రలు పోషించారని వివరించారు.