సౌత్ సినిమా+ -

వీడియోలు+ -

వెబ్ స్టోరీస్+ -

వైరల్+ -

Honey Rose: హనీ రోజ్‌ పెద్ద సాహసమే ఇది 

ABN, Publish Date - Nov 11 , 2025 | 08:51 AM

చిత్రపరిశ్రమలో అగ్ర హీరోలు సైతం తమ చిత్రాలను పాన్‌ ఇండియా స్థాయిలో విడుదల చేసేందుకు వెనుకంజ వేస్తున్న తరుణంలో నటి హనీ రోజ్‌ మాత్రం పెద్ద సాహసం చేస్తున్నారు.


చిత్రపరిశ్రమలో అగ్ర హీరోలు సైతం తమ చిత్రాలను పాన్‌ ఇండియా స్థాయిలో విడుదల చేసేందుకు వెనుకంజ వేస్తున్న తరుణంలో నటి హనీ రోజ్‌ మాత్రం పెద్ద సాహసం చేస్తున్నారు. ఆమె నటించిన ‘రేచల్‌’ను పాన్‌ ఇండియా లెవల్‌లో విడుదల చేసేందుకు సిద్ధమయ్యారు. డిసెంబరు 6న దక్షిణాది భాషలతో పాటు హిందీలో ఒకేసారి రిలీజ్‌ చేయనున్నట్టు అధికారికంగా ప్రకటించారు. 

ఈ చిత్ర గురించి ఆమె మాట్లాడుతూ, ‘కొంత విరామం తర్వాత మళ్ళీ కెమెరా ముందుకు వచ్చాను. ‘రేచల్‌’ ఒక భారీ యాక్షన్‌ మూవీ. నవీన్‌ పాలి ప్రధాన పాత్ర పోషించారు. ‘1983’, ‘యాక్షన్‌ హీరో బైజు’ వంటి పలు చిత్రాలను రూపొందించిన అఫ్రిడ్‌ షైన్‌ ఈ మూవీకి కథ  సమకూర్చడంతో పాటు నిర్మాతగా వ్యవహరించారు. వచ్చే నెల 6న తమిళం, తెలుగు, మలయాళం, కన్నడ, హిందీ భాషల్లో రిలీజ్‌ చేస్తున్నాం’ అని వెల్లడించారు. 

ALSO READ:

Esha Deol - Dharmendra: నాన్న ఆరోగ్యం నిలకడగా ఉంది.. ఈషా దేవోల్‌

Globe Trotter Song: సంచారి .. సంచారి.. సాహసమే తన దారి.. శృతిహాసన్ అదరగొట్టేసింది

Updated Date - Nov 11 , 2025 | 10:45 AM