Sir Madam: విజ‌య్ సేతుప‌తి, నిత్యా మీన‌న్.. స‌ర్ మేడ‌మ్ తెలుగు టీజ‌ర్

ABN , Publish Date - Jul 10 , 2025 | 03:17 PM

విజ‌య్ సేతుప‌తి మ‌రో కొత్త సినిమాతో థియేట‌ర్ల‌కు వ‌చ్చేందుకు రెడీ అయ్యాడు.

Sir Madam

గ‌త నెల‌లో ఏస్ అనే చిత్రంతో ప్రేక్ష‌కుల ఎదుట‌కు వ‌చ్చి నిరాశ‌ప‌ర్చిన విజ‌య్ సేతుప‌తి (Vijay Sethupathi) ఇప్పుడు మ‌రో కొత్త సినిమాతో థియేట‌ర్ల‌కు వ‌చ్చేందుకు రెడీ అయ్యాడు. త‌మిళంలో త‌లైవ‌న్ తలైవి (Thalaivan Thalaivii) పేరుతో రూపొందిన చిత్రాన్ని స‌ర్ మేడ‌మ్ (Sir Madam) అనే పేరుతో తెలుగులోకి అనువ‌దించి రిలీజ్ చేస్తున్నారు.

గ‌తంలో మార‌న్‌, వీర‌న్‌, కెప్టెన్ మిల్ల‌ర్ వంటి సిన‌మాల‌ను నిర్మించిన‌ స‌త్య‌జ్యోతి ఫిలింస్ ఈ సినిమాను నిర్మించ‌గా సూర్య‌, కార్తి, శివ‌కార్తికేయ‌న్ వంటి స్టార్ హీరో సినిమాల‌కు ద‌ర్శ‌క‌త్వం వ‌హించిన పాండిరాజ్ (Pandiraaj) డైరెక్ట్ చేశాడు. నిత్యా మీన‌న్ (Nithya Menen) క‌థానాయిక‌గా యోగిబాబు (Yogi Babu) కీల‌క పాత్ర‌లో న‌టించాడు. సంతోష్ నారాయ‌ణ‌న్ (Santhosh Narayanan) సంగీతం అందించాడు. జూలై25న ఈ చిత్రం థియేట‌ర్ల‌లోకి వ‌స్తుంది.

తాజాగా శుక్ర‌వారం ఈ చిత్రం తెలుగు టీజ‌ర్ విడుద‌ల చేశారు. వంట ప‌ని చేసే ఇద్ద‌రు భార్యాభ‌ర్త‌లు ఓ కార్యంలో వంట చేస్తూ అదే ప‌నిగా ఒక‌రినొక‌రు తిట్టుకుంటూ ఉన్న ఈ ట్రైల‌ర్ కాస్త డిఫ‌రెంట్‌గా ఉంది. అయితే హీరో, హీరోయున్ల‌కు, యోగిబాబుల‌కు వారి సొంత వాయిస్ కాకుండా ఇత‌రుల‌తో చెప్పించిన‌ డ‌బ్బింగ్ ఏమాత్రం సెట్ అవ‌లేదు. పైగా అది ఎబ్బెట్టుగా అనిపిస్తుండ‌డంతో చాలామంది ఇవేం వాయిస్‌లు ఇలా ఉన్నాయి మార్చేయండి ఇలాగే సినిమాకు రాము అంటూ విమ‌ర్శ‌లు చేస్తున్నారు.

క‌నీసం వాళ్ల‌కు రెగ్యులర్‌గా వాయిస్ చెప్పే వారితోనైనా డ‌బ్బింగ్ చేయించాల‌ని హిత‌వు ప‌లుకుతున్నారు. నిత్య మీన‌న్‌ (Nithya Menen)కు ఈమె గొంతు ఫ్ల‌స్ పాయింట్ అని ఆమెకు తెలుగు సూప‌ర్‌గా వ‌చ్చ‌ని అదీ కాకుండా వేరే వాళ్ల‌తో ఆమెకు డ‌బ్బింగ్ చెప్పించ‌డ‌మేంటంటూ నెటిజ‌న్లు గ‌ట్టిగానే వేసుకుంటున్నారు. సినిమా రిలీజ్ స‌మ‌యానికైనా వాళ్ల‌ డ‌బ్బింగ్ మారుస్తారో అలానే విడుద‌ల చేస్తారో చూడాలి .

Updated Date - Jul 10 , 2025 | 03:17 PM