Maareesan Teaser: ఫహాద్- వడివేలు కొత్త సినిమా మారీసన్ టీజర్ చూశారా.. ?
ABN, Publish Date - Jun 05 , 2025 | 03:35 PM
మలయాళ స్టార్ హీరో ఫహాద్ ఫాజిల్(Fahadh Faasil) ఎప్పుడు కొత్త కొత్త కథలను ఎంచుకొని ప్రేక్షకులను ఆశ్చర్యపరుస్తూ ఉంటాడు. హీరోగానే కాకుండా కథ నచ్చితే ఎలాంటి పాత్రలోనైనా నటిస్తాడు.
మలయాళ స్టార్ హీరో ఫహాద్ ఫాజిల్(Fahadh Faasil) ఎప్పుడు కొత్త కొత్త కథలను ఎంచుకొని ప్రేక్షకులను ఆశ్చర్యపరుస్తూ ఉంటాడు. హీరోగానే కాకుండా కథ నచ్చితే ఎలాంటి పాత్రలోనైనా నటిస్తాడు. ఇక గతేడాది ఆవేశం అంటూ వచ్చి ఇండస్ట్రీని షేక్ చేసిన ఫహాద్.. తాజాగా మారీసన్( Mareesan) తో రాబోతున్నాడు.
ఫహాద్ ఫాజిల్, వడివేలు(Vadivelu)ప్రధాన పాత్రల్లో నటిస్తున్న చిత్రం మారీసన్ ( Mareesan) . సుధీష్ శంకర్ దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రాన్ని సూపర్ గుడ్ ఫిల్మ్స్ బ్యానర్ పై ఆర్బీ చౌదరీ నిర్మిస్తున్నారు. ఇప్పటికే ఈ చిత్రం నుంచి రిలీజైన పోస్టర్స్ ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకున్నాయి. తాజాగా ఈ సినిమా టీజర్ ను మేకర్స్ రిలీజ్ చేశారు.
ఒక నిమిషం 23 సెకన్ల ఉన్న ఈ టీజర్ లో డైలాగ్స్ లేకుండా కథను చూపించాలని మేకర్స్ ప్రయత్నం చేశారు. సినిమా అంతా ట్రావెల్ నేపథ్యంలోనే కొనసాగుతుందని తెలుస్తోంది. మాయాబజార్ లోని లాహిరిలాహిరిలో సాంగ్ తమిళ్ వెర్షన్ బ్యాక్ గ్రౌండ్ లో ప్లే అవుతుండగా.. ఫహాద్, వడివేలు ఒక బైక్ పై కలిసి ప్రయాణించడం మొదలుపెడతారు.
ప్రశాంతంగా మొదలైన వారి ప్రయాణం అనుకోకుండా మలుపులు తిరగడం చూపించారు. టీజర్ ను బట్టి ట్రావెల్ థ్రిల్లర్ అని తెలుస్తోంది. ఫహాద్ ఇందులో కూడా తన నట విశ్వరూపాన్ని చూపించినట్లు కనిపిస్తోంది. ఇప్పటికే ఫహాద్ - వడివేలు కలిసి మామన్నన్(Maamannan) లో నటించారు. ఆ సినిమాలో ఫహాద్ విలన్ గా కనిపించగా.. హీరో తండ్రిగా వడివేలు కనిపించాడు.
మామన్నన్ లో ఫహాద్ - వడివేలు మధ్య వచ్చే సీన్స్ కు మంచి మార్కులు పడ్డాయి. ఇక ఇప్పుడు మరోసారి ఈ కాంబో ప్రేక్షకులను అలరించడానికి సిద్దమవుతుంది. ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ పనులను జరుపుకుంటున్న మారీసన్ త్వరలోనే రిలీజ్ కు రెడీ అవుతోంది. మరి ఈ సినిమాతో ఈ కాంబో మరో హిట్ అందుకుంటుందేమో చూడాలి.