Fahadh Faasil: సినిమాలు ఇక చాల్లే.. చూడలేకపోతున్నాం
ABN, Publish Date - Jul 25 , 2025 | 01:40 PM
సాధారణంగా ప్రతి మనిషికి తాము ఎలా బ్రతకాలో అనే ఒక డ్రీమ్ ఉంటుంది. ఆ కలను నెరేవేర్చుకోవడం కోసమే కష్టపడుతూ ఉంటారు.
Fahadh Faasil: సాధారణంగా ప్రతి మనిషికి తాము ఎలా బ్రతకాలో అనే ఒక డ్రీమ్ ఉంటుంది. ఆ కలను నెరేవేర్చుకోవడం కోసమే కష్టపడుతూ ఉంటారు. అయితే లైఫ్ ఎప్పుడు రెండు రకాలుగా ఉంటుంది. యవ్వనంలో ఎలా ఉన్నాం.. వృద్ధాప్యంలో ఎలా ఉన్నాం అనేది చాలా తక్కువమంది ఆలోచిస్తూ ఉంటారు. కెరీర్ సెటిల్ అయ్యాకా.. పిల్లలతో కలిసి ఒక చిన్న కుటుంబంతో సంతోషంగా ఉండాలనేది అందరి కోరిక. కాకపోతే ఒక్కొక్కరు తమకు నచ్చిన ప్రదేశాల్లో ఉండాలని కోరుకుంటారు. అందరిలానే మలయాళ స్టార్ హీరో ఫహాద్ ఫాసిల్ (Fahadh Faasil) కు కూడా ఒక డ్రీమ్ ఉందట.
పుష్ప సినిమాతో పాన్ ఇండియా విలన్ గా మారిపోయిన ఫహాద్ కు తెలుగులో కూడా సపరేట్ ఫ్యాన్ బేస్ ఉంది. డైరెక్టర్ కొడుకుగా ఇండస్ట్రీకి పరిచయమైనా కూడా మంచి మంచి కథలను ఎంచుకుంటూ తనకంటూ ఒక ప్రత్యేకమైన గుర్తింపును తెచ్చుకొని స్టార్ గా కొనసాగుతున్నాడు. ఆయన సినిమాలలానే ఆయన ఆలోచనలు కూడా చాలా డిఫరెంట్ గా ఉంటాయి. ఎవరైనా సినిమా ఇండస్ట్రీని వదిలేశాకా.. కుటుంబంతో విదేశాల్లో సెటిల్ అవ్వాలనో.. తన సొంత గడ్డపై ఉండాలనే కోరుకుంటారు. ఫహాద్ కూడా అలాగే చేయనున్నాడు. కాకపోతే ఒక చిన్న ఛేంజ్.
ఫహాద్ సినిమాలకు గుడ్ బై చెప్పాకా.. క్యాబ్ డ్రైవర్ గా మారతానని చెప్పాడు. మారీశన్ సినిమా ప్రమోషన్స్ లో భాగంగా ఏర్పాటు చేసిన ఒక ఇంటర్వ్యూలో ఫహాద్ మాట్లాడుతూ.. తనకు బార్సిలోనాలో సెటిల్ అవ్వాలని ఉన్నట్లు చెప్పుకొచ్చాడు. అంతేకాకుండా బార్సిలోనాలో తనకు క్యాబ్ నడపడం అంటే ఎంతో ఇష్టమని.. సినిమాలు చాల్లే చూడలేకపోతున్నాం అని ప్రేక్షకులు అన్నప్పుడు సినిమాలకు క్విట్ చెప్పి బార్సిలోనాలోనే సెటిల్ అవ్వాలనుకుంటున్నాను అని చెప్పుకొచ్చాడు. అక్కడ ప్రజలను ఒక ప్రాంతం నుంచి మరో ప్రాంతానికి తీసుకెళ్తాను. ఇది నాకు చాలా ఇష్టమైన జాబ్. నేను నిజం చెప్తున్నా.. అక్కడే నేను స్థిరపడతాను అంటూ చెప్పుకొచ్చాడు. ప్రస్తుతం ఫహాద్ వ్యాఖ్యలు నెట్టింట వైరల్ గా మారాయి.