Dulquer Salman: థగ్ లైఫ్ .. తప్పుకొని మంచి పనిచేసిన దుల్కర్.. ?
ABN, Publish Date - Jun 06 , 2025 | 06:55 PM
ఇండస్ట్రీలో సపరేట్ ఫ్యాన్ బేస్ ఉన్న కాంబో లోక నాయకుడు కమల్ హాసన్(Kamal Haasan)- మణిరత్నం(Manirathnam).
Dulquer Salman: ఇండస్ట్రీలో కొన్ని కాంబోస్ కి సపరేట్ ఫ్యాన్స్ బేస్ ఉంటుంది. ఆ కాంబోస్ రిపీట్ అవుతున్నాయి అంటే ప్రేక్షకుల్లో అంచనాలు ఆకాశాన్ని తాకుతాయి. అలా ఇండస్ట్రీలో సపరేట్ ఫ్యాన్ బేస్ ఉన్న కాంబో లోక నాయకుడు కమల్ హాసన్(Kamal Haasan)- మణిరత్నం(Manirathnam). ఇప్పటికే ఈ కలయికలో నాయకుడు(Nayakudu) లాంటి సినిమా వచ్చి భారీ విజయాన్ని అందుకుంది. దాదాపు ఎన్నో ఏళ్ల తరువాత వీరి కాంబోలో వచ్చిన సినిమా థగ్ లైఫ్(Thug Life). ఈ సినిమాను ప్రకటించినప్పటి నుంచి ప్రేక్షకులు ఎప్పుడెప్పుడు థగ్ లైఫ్ రిలీజ్ అవుతుందా.. ? అని ఎంతో ఆతృతగా ఎదురుచూసారు. ఎట్టకేలకు వివాదాలు, విమర్శలు మధ్య జూన్ 5 న థగ్ లైఫ్ రిలీజ్ అయ్యింది.
ఎప్పుడెప్పుడు సినిమాకు వెళ్దామా అని అనుకున్న ప్రేక్షకులు సినిమా చూసి ఎప్పుడెప్పుడు బయటకు వచ్చేద్దామా అనేంతలా ఈ చిత్రం ఉందని చెప్పుకొస్తున్నారు. అసలు ఇది మణిరత్నం సినిమానేనా అని కొందరు.. మణిరత్నంలో విషయం అయిపోయిందని ఇంకొందరు కామెంట్స్ పెడుతున్నారు. అంతేకాకుండా థగ్ లైఫ్ నుంచి తప్పుకున్న నటులకు కంగ్రాట్స్ చెప్తున్నారు. ఈ సినిమా నుంచి తప్పుకొని మంచి పనిచేశారని చెప్పుకొస్తున్నారు.
థగ్ లైఫ్ సినిమా అనౌన్స్ చేసినప్పుడు కమల్ హాసన్ తో పాటు మలయాళ స్టార్ హీరో దుల్కర్ సల్మాన్(Dulquer Salmaan), కోలీవుడ్ స్టార్ హీరో జయం రవి(Ravi Mohan) పేర్లు కూడా ప్రకటించారు. అయితే షూటింగ్ మొదలుపెట్టే సమయానికి దుల్కర్ సల్మాన్ సినిమా నుంచి తప్పుకున్నాడు. ప్రత్యేకమైన కారణం అంటూ ఏది లేదని, కేవలం డేట్స్ అడ్జెస్ట్ చేయలేక మాత్రమే దుల్కర్ తప్పుకున్నాడని మేకర్స్ తెలిపారు. ఇక దుల్కర్ ప్లేస్ లోనే మణిరత్నం శింబు(Simbhu)ను తీసుకున్నాడు. మరికొన్ని రోజులకు జయం రవి కూడా థగ్ లైఫ్ నుంచి తప్పుకున్నాడు.
ఒకవేళ ఈ ఇద్దరూ ఉండి ఉంటే కథ వేరేలా ఉండేదేమో అన్న విషయం తెలియదు కానీ, ఇదే కథలో కనుక వారు ఉండి ఉంటే కచ్చితంగా ట్రోల్స్ బారిన పడేవారని నెటిజన్స్ చెప్పుకొస్తున్నారు. దుల్కర్.. కమల్ సినిమా నుంచి తప్పుకోవడం ఇదేం మొదటిసారి కాదు. శంకర్- కమల్ కాంబోలో వచ్చిన ఇండియన్ 2 లో కూడా దుల్కర్ కు ఛాన్స్ వచ్చింది. అప్పుడు కూడా కొన్ని కారణాల వలన చేయలేకపోయాడు. ఇండియన్ 2 కూడా పరాజయాన్ని అందుకుంది. ఇప్పుడు థగ్ లైఫ్ కూడా ప్లాప్ అయ్యింది. ఇలా రెండుసార్లు దుల్కర్ భారీ పరాజయాల నుంచి తప్పించుకున్నాడు. ఈ విషయం తెలియడంతో గ్రేట్ ఎస్కేప్ దుల్కర్ అంటూ నెటిజన్స్ కామెంట్స్ పెడుతున్నారు.