సౌత్ సినిమా+ -

వీడియోలు+ -

వెబ్ స్టోరీస్+ -

వైరల్+ -

Thalaivar173: రజినీ, క‌మ‌ల్ కాంబో సినిమా.. త‌ప్పుకున్న ద‌ర్శ‌కుడు

ABN, Publish Date - Nov 14 , 2025 | 06:45 AM

తమిళ సూపర్ స్టార్ రజినీ కాంత్ (Rajinikanth) నటించే 173వ చిత్రం దర్శకత్వ బాధ్యతల నుంచి తప్పుకొంటున్నట్లు సుందర్ (Sundar) ప్రకటించారు.

sunder

తమిళ సూపర్ స్టార్ రజినీ కాంత్ (Rajinikanth) నటించే 173వ చిత్రం దర్శకత్వ బాధ్యతల నుంచి తప్పుకొంటున్నట్లు సుందర్ (Sundar) ప్రకటించారు. ఈ ప్రకటనను ఆయన సతీమణి, నటి ఖుష్బూ (Khushbu Sundar) ఎక్స్ హ్యాండిల్‌లో పోస్ట్ చేశారు. 'సుదీర్ఘకాలం తర్వాత రజనీకాంత్, కమల్ హాసన్ (Kamal Haasan)తో కలిసి పనిచేసే అవకాశం లభించింది.

ఈ అరుదైన అవకాశాన్ని కల్పించిన వారిద్దరికీ ధన్యవాదాలు తెలియజేస్తున్నా. అదేసమయంలో నేను సూపర్ స్టార్ చిత్రానికి దర్శకత్వం వహిస్తున్నట్లు తెలుసుకుని ఎంతో సంతోషపడిన అభిమానులను క్షమాపణలు కోరుతున్నాను.

అనివార్య పరిస్థితుల దృష్ట్యా 'తలైవర్ 173స‌ (Thalaivar173) నుంచి తప్పుకోవాలన్న కఠిన నిర్ణయం తీసుకున్నాను. ఈ ఇద్దరితో కలిసి పనిచేయడం నాకు ఒక కల. కానీ, మన కోసం నిర్దే శించిన మార్గాన్ని మనం అనుసరించాల్సిన సందర్భాలు ఉన్నాయి.

ఈ ఇద్దరు గొప్ప వ్యక్తులను అత్యున్నతంగా గౌరవిస్తాను. వారు నాకు ఎన్నో అమూల్యమైన పాఠాలు నేర్పారు. ఈ అరుదైన అవకాశానికి దూరమైనప్పటికీ ఎల్ల వేళలా వారి మార్గదర్శకత్వాన్ని కోరుకుంటాను' అని పేర్కొ న్నారు. కాగా, ఈ ప్రకటన పోస్ట్ చేసిన కొన్ని నిమిషాల్లోనే ఎక్స్ వేదిక నుంచి ఖుష్బూ తొలగించారు.

Updated Date - Nov 14 , 2025 | 07:05 AM