Arjith Shankar: శంకర్ కూతురు ఇంకా సెట్ అవ్వలేదు.. అప్పుడే కొడుకా

ABN , Publish Date - Aug 08 , 2025 | 10:28 PM

ఇండస్ట్రీలో నేపోటిజం గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. హీరోల వారసులు.. డైరెక్టర్ల వారసులు ప్రస్తుతం ఇండస్ట్రీని ఏలేస్తున్నారు.

Shankar

Arjith Shankar: ఇండస్ట్రీలో నేపోటిజం గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. హీరోల వారసులు.. డైరెక్టర్ల వారసులు ప్రస్తుతం ఇండస్ట్రీని ఏలేస్తున్నారు. కొత్త హీరోలు ఎంతమంది అయితే వస్తున్నారో.. అంతకు డబుల్ గా నేపో కిడ్స్ సందడి చేస్తున్నారు. తాజాగా మరో స్టార్ కిడ్ ఇండస్ట్రీకి పరిచయం అవుతున్నాడని వార్తలు వినిపిస్తున్నాయి. అతను ఎవరో కాదు స్టార్ డైరెక్టర్ శంకర్ (Shankar) కొడుకు అర్జిత్ శంకర్(Arjith Shankar). కోలీవుడ్ లోనే స్టార్ డైరెక్టర్ గా ఎన్నో మంచి సినిమాలను అందించాడు శంకర్. కేవలం తమిళ్ లోనే కాదు.. తెలుగులో కూడా తనకంటూ ఒక ప్రత్యేకమైన గుర్తింపును సంపాదించుకున్నాడు.


అయితే శంకర్ లాస్ట్ మూవీస్ ఇండియన్ 2, గేమ్ ఛేంజర్ సినిమాలు భారీ పరాజయాన్ని అందుకున్న విషయం తెల్సిందే. ఇక శంకర్ వారసురాలిగా.. ఇండస్ట్రీకి పరిచయమైంది అదితి శంకర్. కూతురిని ఇండస్ట్రీకి పరిచయం చేయడ శంకర్ కు ఇష్టం లేదని, రెండేళ్లలో స్టార్ గా ఎదిగితే ఉంటాను అని, లేకపోతే వచ్చేస్తాను అని చెప్పినట్లు అదితి చాలాసార్లు చెప్పుకొచ్చింది. శంకర్ ఇప్పుడిప్పుడే అదితి విషయంలో కొద్దిగా కన్విన్స్ అవుతున్నట్లు సమాచారం. తండ్రికి మాట ఇచ్చినట్లు అదితి ఇండస్ట్రీలో అంతటి సక్సెస్ ను అందుకోలేకపోయింది. వరుస అవకాశాలను అందుకున్నా సెట్ అవ్వలేదు.


ఇక కూతురు సెట్ అవ్వకుండానే శంకర్.. కొడుకును ఇండస్ట్రీకి పరిచయం చేయబోతున్నాడని వార్తలు వినిపిస్తున్నాయి. శంకర్ కొడుకు అర్జిత్ తండ్రిలానే మొదట మురగదాస్ దగ్గర అసిస్టెంట్ డైరెక్టర్ గా మారాడు. అందరూ శంకర్ వారసత్వం ఎక్కడకు పోతుంది.. డైరెక్టర్ గానే వారసుడు ఎంట్రీ ఇస్తాడేమో అనుకున్నారు. కానీ, హఠాత్తుగా ప్లేట్ మార్చిన అర్జిత్ సడెన్ గా హీరోగా ఎంట్రీ ఇవ్వడానికి సిద్దమయ్యాడట. స్టార్ డైరెక్టర్ అట్లీ వద్ద పనిచేసిన అసిస్టెంట్ డైరెక్టర్ ను డైరెక్టర్ గా అర్జిత్ ను హీరోగా పరిచయం చేయనున్నారట. త్వరలోనే ఈ కాంబోను అధికారికంగా ప్రకటించనున్నారని తెలుస్తోంది. మరి అక్కలా తమ్ముడు కూడా హీరోగా మారడానికి స్ట్రగుల్ అవుతాడా.. ? లేక సక్సెస్ అవుతాడా.. ? అనేది చూడాలి.

Constable Kanakam Trailer: వేటాడితే బెదరడానికి అది జింక కాదు.. ఉత్కంఠ రేపుతున్న కానిస్టేబుల్ కనకం ట్రైలర్

Shiva Re-Release: అక్కినేని ఫ్యాన్స్ కు డబుల్ ట్రీట్.. కూలీతో పాటే శివ

Updated Date - Aug 08 , 2025 | 10:28 PM