సౌత్ సినిమా+ -

వీడియోలు+ -

వెబ్ స్టోరీస్+ -

వైరల్+ -

Rd Narayanamurthy: గుండెపోటుతో.. దర్శకుడు ఆర్డీ నారాయణమూర్తి కన్నుమూత

ABN, Publish Date - Sep 25 , 2025 | 11:11 AM

ప్రఖ్యాత సినీ దర్శకుడు ఆర్డీ నారాయణమూర్తి (59) గుండెపోటుతో మృతి చెందారు. ‘మనసున మనసై’, ‘ఒరు పొన్ను ఒరు పయ్యన్‌’ చిత్రాలకు దర్శకత్వం వహించారు.

RD Narayanamurthy

ప్రముఖ త‌మిళ‌ సినీ దర్శకుడు ఆర్డీ నారాయణమూర్తి (59) (R D Narayanamurthy) గుండెపోటుతో మంగళవారం రాత్రి తుదిశ్వాస విడిచారు. అనారోగ్య సమస్యల కారణంగా ఆయన కొద్దిరోజులుగా చెన్నైలోని ఓమందూర్‌ ప్రభుత్వాస్పత్రిలో చికిత్స పొందుతున్నారు. అయితే మంగళవారం రాత్రి 8.30 గంటలకు గుండెపోటు రావడంతో ఆయన మరణించారు.

2001లో విడుదలైన ‘మ‌నత్తై తిరుడి విట్టాయ్‌’ (Manathai Thirudivittai) (తెలుగులో ‘మనసున మనసై’) చిత్రానికి దర్శకత్వం వహించి గుర్తింపు పొందారు. ప్రభుదేవా, కౌసల్య, గాయత్రి జయరామ్, వడివేలు, వివేక్‌ వంటి ప్రముఖులు ఆ చిత్రంలో నటించారు. అలాగే ‘ఒరు పొన్ను ఒరు పయ్యన్‌’ చిత్రాన్ని కూడా ఆయన తెరకెక్కించారు.

ఆయన కుమారుడు ప్రస్తుతం విదేశాల్లో ఉండటం, నగరానికి చేరుకోవడంలో ఆలస్యం జరుగుతుండ డంతో నారాయణమూర్తి మృతదేహాన్ని చెన్నై పమ్మల్‌లోని ఆయన నివాసంలో ఉంచారు. అంత్య క్రియలు శుక్రవారం ఉదయం జరుగనున్నట్లు కుటుంబ సభ్యులు తెలిపారు.

Updated Date - Sep 25 , 2025 | 11:16 AM