సౌత్ సినిమా+ -

వీడియోలు+ -

వెబ్ స్టోరీస్+ -

వైరల్+ -

Maniratnam: థగ్ లైఫ్ పరాజయం.. స్పందించిన మణిరత్నం

ABN, Publish Date - Jun 23 , 2025 | 05:28 PM

మణిరత్నం.. ఇది పేరు మాత్రమే కాదు అదొక బ్రాండ్. కల్ట్ క్లాసిక్ సినిమాలకు ఆయన పెట్టింది పేరు. ఇంకోపక్క విశ్వ నాయకుడు కమల్ హాసన్ (Kamal Haasan).. యూనివర్సల్ గా అభిమానులను సంపాదించుకున్న నటుడు.

Maniratnam

Maniratnam: జనరేషన్ మారేకొద్దీ అన్నింటిలో మార్పులు రావడం సహజం. ఒకప్పుడు హీరోలను చూసే సినిమాలకు వెళ్లే ప్రేక్షకులు కొద్దీ కొద్దీగా మారుతూ వస్తున్నారు. వారికి తగ్గట్టే సినిమాలను తెరకెక్కిస్తున్నారు మేకర్స్. ఇదివరకటిలా సినిమా సక్సెస్ అయినా అవ్వకపోయినా.. చిత్ర బృందం ఒక్కరోజులోనే ఇన్ని కలక్షన్స్ వచ్చాయి అంటూ సక్సెస్ మీట్ లు పెట్టడం లేదు. సినిమా హిట్ అయితే ప్రేక్షకులకు థ్యాంక్స్ చెప్తున్నారు. ఒకవేళ సినిమా పరాజయాన్ని అందుకుంటే ఎలాంటి సంకోచం లేకుండా అందరి ముందు క్షమాపణలు కోరుతున్నారు. ఇక ఇలా క్షమాపణలు అడగడానికి స్టార్ డైరెక్టర్ మణిరత్నం(Maniratnam) కూడా అతీతుడేమి కాదు. తాజాగా ఆయన తన సినిమాను ప్రేక్షకులు ఆదరించకపోవడంతో తమని క్షమించమని కోరాడు.


మణిరత్నం.. ఇది పేరు మాత్రమే కాదు అదొక బ్రాండ్. కల్ట్ క్లాసిక్ సినిమాలకు ఆయన పెట్టింది పేరు. ఇంకోపక్క విశ్వ నాయకుడు కమల్ హాసన్ (Kamal Haasan).. యూనివర్సల్ గా అభిమానులను సంపాదించుకున్న నటుడు. వీరిద్దరి కలయికలో వచ్చిన సినిమా నాయకుడు. ఇప్పటికీ ది బెస్ట్ గ్యాంగ్ స్టర్ సినిమాల లిస్ట్ తీస్తే నాయకుడు మొదటి వరసలో ఉంటుంది అని చెప్పొచ్చు. అలాంటి ఈ కాంబో మరోసారి రిపీట్ అవుతుంది అంటే ఎన్ని అంచనాలు ఉంటాయి. థగ్ లైఫ్ (Thug Life) అనే సినిమా వీరి కాంబోలో వస్తుంది అంటే తమిళ్ అభిమానులు మాత్రమే కాదు తెలుగు ప్రేక్షకులు కూడా ఈ సినిమా కోసం ఎంతో ఆత్రుతగా ఎదురుచూసారు.


గత కొన్నేళ్లుగా సరైన విజయాన్ని చవిచూడని మణిరత్నం.. కమల్ తో కలిసి థగ్ లైఫ్ తో వస్తున్నాడు అంటే ఏదో గట్టిగానే ప్లాన్ చేశాడు అనుకోని ప్రేక్షకులు ఎంతో ఉత్సాహంగా థియేటర్ లోపలి వెళ్లి ఊసురుమంటూ బయటకు వచ్చారు. ఎంతమంది స్టార్స్ ఉండి ఏం లాభం.. కథ కూడా ఉండాలి కదా అని ప్రేక్షకులు పెదవి విరిచారు.. దానికి తోడు కమల్ భాషా వివాదం ఒకటి. అలా థగ్ లైఫ్ భారీ పరాజయాన్ని చవిచూసింది. అసలు దారుణమైన విషయం ఏంటంటే ఇండియన్ 2 కన్నా తక్కువ కలక్షన్స్ రాబట్టి డిజాస్టర్ లిస్ట్ లో చేరింది.


తాజాగా మణిరత్నం.. థగ్ లైఫ్ రిజల్ట్ పై స్పందించాడు. ప్రేక్షకులను మెప్పించలేకపోయామని, తమను క్షమించమని కోరాడు. 'మా ఇద్దరి నుంచి అందరూ నాయకుడు లాంటి సినిమాను ఆశించారు. వారందరికీ నేను చెప్పేది ఒకటే. మమ్మల్ని క్షమించండి. నాయకుడు కంటే తక్కువ సినిమాను చేయడం మా ఉద్దేశ్యం కాదు. ఎవరూ అలా అనుకోవద్దు. ఎవరైనా ఆ సినిమా కన్నా తక్కువ ఉండే సినిమా చేయాలనీ అనుకుంటారా.. ? మేము థగ్ లైఫ్ పై ఎక్కువ అంచనాలను పెట్టుకున్నాం.. కానీ, దాని ఫలితం మేము ఊహించనిది. మేము అందించినదానికన్నా ఎక్కువ, భిన్నమైన కథను ప్రేక్షకులు మా నుంచి కోరుకున్నారని నాకు అర్ధమయ్యింది. అలాంటి మంచి కథతోనే వస్తాను' అంటూ చెప్పుకొచ్చాడు. ప్రస్తుతం ఈ వ్యాఖ్యలు నెట్టింట వైరల్ గా మారాయి.

Trisha- Vijay: రిలేషన్ లో త్రిష- విజయ్.. ఇదిగో సాక్ష్యం ..?

Updated Date - Jun 23 , 2025 | 05:31 PM