Dhanush: ఎయిర్ ఫోర్స్ అధికారిగా ధనుష్
ABN, Publish Date - Jun 07 , 2025 | 06:19 PM
కోలీవుడ్ స్టార్ ఫ్యాన్స్‌ను కన్ఫ్యూజ్ చేస్తున్నాడు.లవ్ స్టోరీ అని చెప్పి పక్కా మాస్ అవతారమెత్తుతున్నాడు. ఫస్ట్ లుక్ ఒకలా.. రీసెంట్ లుక్ మరోలా ఉండటంతో అసలు ఏం జరుగుతుందా అని ఎగ్జయింటింగ్‌గా ఎదురుచూస్తున్నారు.
స్టైలిష్ స్టార్ ధనుష్ (Dhanush) , బాలీవుడ్ డైరెక్టర్ ఆనంద్ ఎల్ రాయ్ (Aanand L Rai) కాంబోలో తెరకెక్కుతున్న లవ్ డ్రామా తేరే ఇష్క్ మే (Tere Ishk Mein) . చాలా రోజుల తర్వాత ధనుష్ చేస్తున్న ప్రేమ కథ కావడంతో భారీ అంచనాలున్నాయి. అయితే ఈ మూవీ స్టోరీ లైన్ విషయంలో ఫ్యాన్స్‌ను తెగ తికమకపెట్టేస్తున్నారు మేకర్స్. ఫస్ట్ లుక్‌కు తాజాగా విడుదలైన ఫోటోలకు చాలా తేడా ఉండటంతో అసలు కథ ఏమిటా అన్న చర్చ సాగుతోంది.
తేరే ఇష్క్ మే షూటింగ్ స్పాట్ నుంచి తాజాగా సోషల్ మీడియాలో కొన్ని ఫోటోలు వైరల్ అవుతున్నాయి. ఈ ఫోటోల్లో ధనుష్ ఇండియన్ ఎయిర్ ఫోర్స్ యూనిఫాం (Indian Air Force uniform) లో కనిపిస్తూ, షార్ట్ హెయిర్, స్టీలీ మీసంతో ఓ డిఫరెంట్ అవతార్‌లో ఆకట్టుకుంటున్నాడు. అయితే ఈ లుక్, సినిమా ఫస్ట్ లుక్‌లో చూపించిన లాంగ్ హెయిర్, ఫుల్ బియర్డ్ లుక్‌కి పూర్తి భిన్నంగా ఉండటంతో..ఫ్యాన్స్ ఆశ్చర్యపోతున్నారు. రెండు పాత్రల్లో చేస్తున్నాడా లేక మరేదైనా ఫ్లాష్ బ్యాక్ ఎపిసోడ్ ఉంటుందా అని చర్చించుకుంటున్నారు.
'తేరే ఇష్క్ మే' టీజర్ ఇప్పటికే సినీ ప్రేమికుల్లో హైప్ క్రియేట్ చేసింది. వాయిస్ ఓవర్ ద్వారా పాత్ర ట్రాన్స్‌ఫర్మేషన్, ఐడెంటిటీ థీమ్‌ని హైలైట్ చేశారు. ఈ సినిమాలో ధనుష్ సరసన కృతి సనన్ (Kriti Sanon) నటిస్తుండగా.. ఆమె ముక్తి (Mukti)అనే క్యారెక్టర్‌లో కనిపించనుంది. నవంబర్ 28న థియేట్రికల్ రిలీజ్‌కి సిద్ధమవుతున్న 'తేరే ఇష్క్ మే' సినిమా, ధనుష్-కృతి సనన్ జోడీతో ఓ మరపురాని లవ్ స్టోరీగా రూపొందుతోంది. ఫ్యాన్స్ ఈ సినిమా కోసం ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. మరి, అభిమానులను ధనుష్ ఏ తీరున ఆకట్టుకుంటాడో చూడాలి.