Idly Kottu: ధనుష్ ఇడ్లీ కొట్టు.. రిలీజ్ ఎప్పుడంటే
ABN , Publish Date - Sep 14 , 2025 | 10:06 PM
కోలీవుడ్ స్టార్ హీరో ధనుష్ (Dhanush) కుబేరతో ఈ ఏడాది మంచి విజయాన్ని అందుకున్నాడు.
Idly Kottu: కోలీవుడ్ స్టార్ హీరో ధనుష్ (Dhanush) కుబేరతో ఈ ఏడాది మంచి విజయాన్ని అందుకున్నాడు. ఈ సినిమా తరువాత వరుస చిత్రాలతో బిజీగా మారాడు. ప్రస్తుతం ధనుష్ నటిస్తున్న చిత్రాల్లో ఇడ్లీ కొట్టు (Idly Kottu) ఒకటి. ధనుష్ హీరోగా నటిస్తూ డైరెక్ట్ చేస్తున్న ఈ చిత్రాన్ని డాన్ పిక్చర్స్, వండర్‌బార్ ఫిల్మ్స్ బ్యానర్స్ పై ఆకాష్ బాస్కరన్ ఈ చిత్రాన్ని ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్నారు. ఈ చిత్రంలో ధనుష్ సరసన నిత్యా మీనన్ నటిస్తోంది. ఇప్పటికే ఈ చిత్రం నుంచి రిలీజైన పోస్టర్స్, సాంగ్ ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకున్నాయి.
అన్నీ బావుండి ఉంటే ఈపాటికి ఎప్పుడో ఇడ్లీ కొట్టు రిలీజ్ అయ్యేది. కానీ, కొన్ని కారణాల వలన ఈ సినిమా ఆలస్యంగా రిలీజ్ అవుతుంది. ఇక తాజాగా మేకర్స్ ఈ సినిమా రిలీజ్ డేట్ ను అధికారికంగా ప్రకటించారు. ఈ చిత్రం తెలుగు, తమిళ్ లో ఒకేసారి అక్టోబర్ 1న రిలీజ్ కానుందని తెలుపుతూ పోస్టర్ రిలీజ్ చేశారు. అంతేకాకుండా చాలామంది ఈ సినిమా తెలుగు రైట్స్ కోసం పోటీ పడ్డారు. ఫైనల్ గా ధనుష్ కెరీర్ లోనే హైయెస్ట్ ధరకు శ్రీ వేదక్షర మూవీస్ తెలుగు రైట్స్ ని దక్కించుకుంది.
శ్రీ వేదక్షర మూవీస్ బ్యానర్ ద్వారా నిర్మాత రామారావు చింతపల్లి తెలుగులో ఈ చిత్రాన్ని గ్రాండ్ గా విడుదల చేయనున్నారు.ఈ సందర్భంగా ర్మాత రామారావు చింతపల్లి మాట్లాడుతూ.. ' ఈ సినిమా తెలుగు రైట్స్ మాకు ఇచ్చినందుకు ధనుష్ గారికి, టీం కి కృతజ్ఞతలు తెలియజేస్తున్నాము. అక్టోబర్ 1 న ఇడ్లీ కొట్టు రిలీజ్ కు సిద్దమవుతుంది' అని తెలిపారు. మొదటినుంచి కూడా ఈ సినిమాపై అభిమానులు భారీ అంచనాలను పెట్టుకున్నారు. అందులోనూ ఇప్పటివరకు ధనుష్ దర్శకత్వంలో వచ్చిన సినిమాలు మంచి పాజిటివ్ టాక్ నే తెచ్చుకున్నాయి. దీంతో ఈ సినిమా కూడా మంచి విజయాన్ని అందుకుంటుంది అని నెటిజన్స్ కామెంట్స్ చేస్తున్నారు. మరి ధనుష్ ఇడ్లీ కొట్టు ఎలాంటి విజయాన్ని అందుకుంటుందో చూడాలి.
They Call Him OG: మిలియన్ డాలర్ పిక్చర్ అంటే ఇదే
Jyoti Poorvaj: ఎద అందాలను ఎరగా వేసి జగతి ఆంటీ రచ్చ.. ఆ టాటూనే స్పెషల్