సౌత్ సినిమా+ -

వీడియోలు+ -

వెబ్ స్టోరీస్+ -

వైరల్+ -

Dhanush - Mrunal: ధనుష్‌.. మృణాల్‌ ఛాట్‌ రచ్చరచ్చ

ABN, Publish Date - Nov 24 , 2025 | 01:54 PM

సినిమా ఇండస్ట్రీలో హీరోహీరోయిన్లు కాస్త చనువుగా ఉంటే చాలు లింక్‌ చేస్తూ, రూమర్స్‌ పుడుతూనే ఉంటాయి. ప్రేమ, డేటింగ్‌, పెళ్లి అంటూ వార్తలు చక్కర్లు కొడుతూనే ఉంటాయి.


సినిమా ఇండస్ట్రీలో హీరోహీరోయిన్లు కాస్త చనువుగా ఉంటే చాలు లింక్‌ చేస్తూ, రూమర్స్‌ పుడుతూనే ఉంటాయి. ప్రేమ, డేటింగ్‌, పెళ్లి అంటూ వార్తలు చక్కర్లు కొడుతూనే ఉంటాయి. అలా ఈ మధ్యన బాగా హాట్‌ టాపిక్‌ అయిన జంట ధనుష్‌ (Dhanush), మృణాల్‌ (Mrunal). వీరిద్దరూ డేటింగ్‌లో ఉన్నారంటే కొన్ని రోజులుగా వార్తలు హల్‌చల్‌ చేస్తున్నాయి. ఈ మధ్య పలు పార్టీల్లో వీరిద్దరూ తరచూ కనిపిస్తున్నారు. ‘సన్‌ ఆఫ్‌ సర్దార్‌ 2’ ప్రీమియర్‌లో ధనుష్‌-మృణాల్‌ జంట ఒకరినొకరు  టైట్‌గా హగ్‌ చేసుకున్న వీడియో వైరల్‌ కాగా, డేటింగ్‌ రూమర్స్‌ మొదలయ్యాయి. ఆ తర్వాత ధనుష్‌కి ఎలాంటి సంబంధం లేని ఈవెంట్లో ఎందుకు ప్రత్యక్షమయ్యాడు? మృణాల్‌ కోసమేనా? అంటూ గుసగుసలు మొదలయ్యాయి. అయితే ఈవెంట్‌లకు కలిసి వెళ్తుండడంతో ఆ వార్తలకు మరింత బలపడ్డాయి. తాజాగా వీరిద్దరూ మరోసారి వార్తల్లో నిలిచారు. సోషల్‌ మీడియాలో మృణాల్‌ పోస్ట్‌కు ధనుష్‌ కామెంట్‌ పెట్టడం, ఆ కామెంట్‌కు మృణాల్‌ లవ్‌ సింబల్‌తో సమాధానం చెప్పడం అందుకు కారణం.



తాజాగా మృణాల్‌ నటించిన ‘దో దీవానే షెహర్‌ మే’ టీజర్‌ను ఇన్‌స్టాగ్రామ్‌లో షేర్‌ చేశారామె. ఈ పోస్ట్‌కు ధనుష్‌ ‘టీజర్‌ చాలా బాగుంది. చూడటానికి, వినడానికి బావుంది’ అని పోస్ట్‌ చేశాడు. దీనికి మృణాల్‌ హార్ట్‌, ఫ్లవర్‌ ఎమోజీలతో ప్రతిస్పందించింది. ప్రస్తుతం వాటిని స్ర్కీన్‌షాట్స్‌ తీసి సోషల్‌ మీడియాలో షేర్‌ చేసి వైరల్‌ చేస్తున్నారు నెటిజన్లు. అంతే కాదు వీరిద్దరి మధ్య ఏం జరుగుతోందని చర్చలు మొదలుపెట్టారు. ఆ ఇద్దరినీ తలైవా- తలైవి అంటూ కామెంట్స్‌ పెడుతున్నారు. రెండు నెలల క్రితం డేటింగ్‌ రూమర్స్‌పై మృణాల్‌ స్పందించారు. ‘నా కెరీర్‌లో ఇంకా చేయాల్సినవి చాలా ఉన్నాయి. వాటిపై దృష్టిపెట్టాను. ఏం జరుగుతుంది, ఏం జరగదనే విషయాలు అందరికీ తెలుసు. అందుకే నా జీవితంలో జరిగే వాటి గురించి నిరంతరం ఆలోచించడం, మాట్లాడడం నాకు ఇష్టం ఉండదు’ అని అన్నారు.

 

Updated Date - Nov 24 , 2025 | 02:40 PM