Amara Kavyam Trailer: నా జీవితం నాశనమయ్యింది ఈ ప్రేమ వల్లే.. ధనుష్ అదరగొట్టాడు
ABN, Publish Date - Dec 05 , 2025 | 02:56 PM
కోలీవుడ్ స్టార్ హీరో ధనుష్ (Dhanush) ప్రస్తుతం వరుస సినిమాలతో బిజీగా మారిన విషయం తెల్సిందే, తెలుగు, తమిళ్ భాషల్లో వరుస విజయాలను అందుకుంటున్నాడు.
Amara Kavyam Trailer: కోలీవుడ్ స్టార్ హీరో ధనుష్ (Dhanush) ప్రస్తుతం వరుస సినిమాలతో బిజీగా మారిన విషయం తెల్సిందే, తెలుగు, తమిళ్ భాషల్లో వరుస విజయాలను అందుకుంటున్నాడు. ఇక ఈ మధ్యనే హిందీలో ధనుష్ నటించిన తేరి ఇష్క్ మే (Tere Ishk Mein) సినిమా రిలీజ్ అయ్యి మిక్స్డ్ టాక్ ను అందుకుంది. బాలీవుడ్ డైరెక్టర్ ఆనంద్ ఎల్ రాయ్ (Anand L Rai) దర్శకత్వం వహించిన ఈ చిత్రంలో ధనుష్ సరసన కృతి సనన్ (Kriti Sanon) నటించింది. నవంబర్ 28 న ఈ సినిమా తెలుగు, తమిళ్, హిందీ భాషల్లో రిలీజ్ చేశారు. కానీ, హిందీలో తప్ప తెలుగు, తమిళ్ లో అసలు షోస్ ఉన్నట్లు కూడా ఎవరికి తెలియదు.
ఇక దీంతో మేకర్స్.. హిందీలో కంటే సౌత్ లో ధనుష్ కు ఉన్న ఇమేజ్ ను దృష్టిలో పెట్టుకొని ఇక్కడ ప్రమోషన్స్ చేసి సినిమాపై హైప్ తీసుకురావడం కోసం కష్టపడుతున్నారు. అందులో భాగంగానే తెలుగులో అమర కావ్యం అనే పేరుతో ప్రమోషన్స్ షురూ చేశారు. తాజాగా అమర కావ్యం ట్రైలర్ ని మేకర్స్ రిలీజ్ చేశారు. ట్రైలర్ ఆద్యంతం ఆకట్టుకుంటుంది. ఒక అగ్రెసివ్ యువకుడు.. ప్రేమలో పడితే ఎలా ఉంటుంది అనేది సినిమా కథగా తెలుస్తోంది.
శంకర్(ధనుష్) కి కోపం ఎక్కువ. కాలేజ్ లో ఎప్పుడు గొడవలు పడుతూ ఉంటాడు. అలా గొడవ పడుతున్న సమయంలోనే అతనికి సాహీ(కృతి సనన్) పరిచయమవుతుంది. ఆ పరిచయం ప్రేమగా మారుతుంది. ఆ కోపాన్ని తాను కంట్రోల్ చేసి శంకర్ ను నార్మల్ చేస్తానని ఆమె అనుకుంటుంది. కానీ, నిజాయితీగా ప్రేమించిన శంకర్ ఆ కోపం వలనే ప్రేమను కోల్పోవాల్సి వస్తుంది. దాంతో అతను ఏం చేశాడు. సాహీ జీవితాన్ని ఎలా నాశనం చేశాడు. చివరికి ఈ జంట కలిశారా.. ? లేదా.. ? అనేది సినిమా చూసి తెలుసుకోవాల్సిందే. ప్రేమ కథలకు బ్రాండ్ అంబాసిడర్ అయినా ఆనంద్ ఎల్ రాయ్ అమర కావ్యం సినిమాను ఒక కావ్యంగానే మలిచాడు. ఏఆర్ రెహమాన్ మ్యూజిక్ సినిమాకు హైలైట్. మరి ఈ సినిమా తెలుగు, తమిళ్ లో ఎలాంటి విజయాన్ని అందుకుంటుందో చూడాలి.