Coolie: 'కూలీ' డిఫరెంట్ ప్రమోషన్స్
ABN , Publish Date - Jul 31 , 2025 | 06:52 PM
ఎంత భారీ చిత్రాన్ని తీసినా... దాన్ని పబ్లిసిటీ చేయడం చాలా ఇంపార్టెంట్. ఆడియన్స్ లో ఇంట్రెస్ట్ కలిగించడం ఎవరికైనా బిగ్ ఛాలెంజ్. పాత పద్ధతులు ఇప్పుడు పెద్దగా వర్కవుట్ అవ్వడం లేదు. దీంతో మేకర్స్ కొత్త మార్గాలను వెతుక్కుంటున్నారు. తాజాగా సూపర్ స్టార్ రజనీకాంత్ మూవీ కోసం చేసిన కొత్త ప్రయోగం ఇండస్ట్రీలో హాట్ టాపిక్ గా మారింది.
సూపర్‌స్టార్ రజనీకాంత్ (Rajinikanth), యంగ్ డైరెక్టర్ లోకేష్ కనగరాజ్ (Lokesh Kanagaraj) కాంబినేషన్ లో వస్తున్న పాన్ ఇండియా చిత్రం ‘కూలీ’ (Coolie). ఈ సినిమాపై సినీ అభిమానుల్లో ఇప్పటికే భారీ హైప్ క్రియేట్ అయింది. రజనీ - లోకేష్ కాంబో అంటేనే మాస్ ఎంటర్‌టైన్‌మెంట్, హై - ఓల్టేజ్ యాక్షన్‌తో పాటు ఫ్యాన్స్‌కు పూనకాలు తెప్పించే సినిమాటిక్ ఎక్స్‌పీరియన్స్ గ్యారంటీ. ఈ సినిమా కోసం అభిమానులు ఎంతో ఆతృతగా వేచి చూస్తున్నారు. అయితే, ఈ చిత్ర యూనిట్ చేపట్టిన ఒక వినూత్న ప్రమోషనల్ ఐడియా సోషల్ మీడియాలో సెన్సేషన్‌గా మారింది.
కామన్ గా అందరూ చేసే ప్రమోషన్ స్ట్రాటజీలను పక్కనపెట్టి... ‘కూలీ’ టీం మాత్రం ఒక్కడుగు ముందుకు వేసింది. ఆడియన్స్ ని ఆకట్టుకునే కొత్త తరహా వ్యూహంతో అదరగొట్టింది. అమెజాన్ డెలివరీ బాక్స్‌లపై ‘కూలీ’ సినిమా పోస్టర్లను ముద్రించి... అందరి దృష్టినీ ఒక్కసారిగా తమ వైపు తిప్పుకుంది. రజనీకాంత్ లుక్‌తో కూడిన ఈ పోస్టర్లను డెలివరీ బాక్స్‌లపై చూసిన నెటిజన్లు ఆశ్చర్యపోతున్నారు. ఈ యూనిక్ ఐడియాపై ప్రశంసల జల్లులు కురిపిస్తున్నారు.
తమ క్రియేటివ్ థాట్స్ ను మరింత రీచ్ గా ప్రెజెంట్ చేయడానికి ‘కూలీ’ టీం ఒక స్పెషల్ ప్రమోషనల్ వీడియోను కూడా రిలీజ్ చేసింది. ఈ వీడియోలో అమెజాన్ బాక్స్‌లపై సినిమా పోస్టర్లు, వాటిని చూసి సంతోషించే ప్రేక్షకుల స్పందనలు ఆకట్టుకునేలా ఉన్నాయి. ఈ వినూత్న ప్రమోషన్స్ సినిమాపై ఉన్న క్రేజ్‌ను రెట్టింపు చేసింది. సోషల్ మీడియాలో ఈ వీడియో వైరల్ కావడంతో ‘కూలీ’ చర్చలు మరింత జోరందుకున్నాయి. ఈ భారీ చిత్రం ఆగస్టు 14న తెలుగు, తమిళ, హిందీ, కన్నడ భాషల్లో గ్రాండ్ రిలీజ్‌కు సిద్ధమవుతోంది. పాన్ ఇండియా స్థాయిలో తెరకెక్కుతున్న ఈ మూవీ, ప్రమోషన్స్‌లోనే తన మార్క్ చూపెట్టడం క్రేజీగా మారింది. ప్రమోషన్స్ తో అదరగొడుతున్న ఈ మూవీ విడుదల తర్వాత ఎన్ని రికార్డులను కొల్లగొడుతుందో చూడాలి.
Read Also: Mahesh Babu: మహేష్ బాబు బర్త్ డే ట్రీట్ ఉన్నట్టా... లేనట్టా...
Read Also: Zootopia 2: తెలుగులోనూ రాబోతున్న క్రేజీ యానిమేషన్ మూవీ