Mahesh Babu: మహేష్ బాబు బర్త్ డే ట్రీట్ ఉన్నట్టా... లేనట్టా...

ABN , Publish Date - Jul 31 , 2025 | 05:19 PM

Mahesh Babu Fans waiting for SSMB29 Birthday Surprise ఆగస్టు అంటే ప్రిన్స్ మహేశ్ బాబు అభిమానులకు పండగే. అదిరిపోయే అప్డేట్స్ వచ్చేది ఆ నెలలోనే. అందుకే ఏడాదంతా ఆ నెల ఎప్పుడు వస్తుందా? అని ఎదురు చూస్తుంటారు. కానీ ఈసారి ఎంత వెయిట్ చేసినా లాభం ఉండేలా కనిపించడం లేదు.

టాలీవుడ్ సూపర్‌స్టార్ మహేష్ బాబు (Mahesh Babu), దర్శక ధీరుడు ఎస్. ఎస్. రాజమౌళి (S. S. Rajamouli ) కాంబినేషన్‌లో రూపొందుతున్న సినిమా పట్ల అభిమానుల్లో ఉత్కంఠ రోజురోజుకూ పెరిగిపోతోంది. అంతర్జాతీయ స్థాయిలో భారీ బడ్జెట్‌తో తెరకెక్కుతుండటంతో భారీ అంచనాలు ఏర్పడ్డాయి. గత అనుభవాలను దృష్టిలో పెట్టుకుని ప్రాజెక్ట్ నుంచి ఎలాంటి లీకులు బయటకు రాకుండా ఈ ప్రాజెక్ట్‌ను చిత్ర యూనిట్ అత్యంత రహస్యంగా నిర్వహిస్తోంది. కాగా ఆగస్ట్ లో మహేష్ బాబు పుట్టినరోజు సందర్భంగా అభిమానులు ఈ సినిమాకు సంబంధించిన అప్డేట్స్ కోసం ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. కానీ చిత్ర యూనిట్ మాత్రం ఈ సందర్భంలో కూడా ఎలాంటి బర్త్ డే గిఫ్టులు ఇచ్చేలా కనిపించడం లేదు.


రాజమౌళి సినిమా కోసం ఇంటర్నేషనల్ ప్రొడక్షన్ కంపెనీస్ భాగస్వామ్యం అయ్యేందుకు ఆసక్తి చూపిస్తున్నాయని సమాచారం. దీంతో ఈ సినిమా డీలింగ్స్ పూర్తయ్యే వరకు ఎట్టి పరిస్థితుల్లోనూ అప్డేట్స్ ఇవ్వకూడదని రాజమౌళి టీమ్ నిర్ణయించినట్లు తెలుస్తోంది. అలాగే ఇంటర్నేషనల్ ప్రమోషన్స్, ఆస్కార్ క్యాంపెనింగ్ ప్లాన్స్ కూడా ఉండటంతో ఇప్పుడు ఎలాంటి అప్డేట్ల జోలికి పోవద్దని అనుకుంటున్నారట. 2027లో ఈ సినిమా రిలీజ్ అయ్యే అవకాశం ఉండడంతో... వచ్చే ఏడాది 2026 ఆగస్టులో ఓ సాలిడ్ ఫస్ట్ లుక్ లేదా గ్లిమ్స్ లేదా టీజర్ రిలీజ్ చేసి హైప్ పెంచాలని భావిస్తున్నారట. ఈ విషయం తెలిసిన అభిమానులు ఇప్పుడు కాస్త డిజప్పాయింట్ అవుతున్నారు. మరికొందరు రాజమౌళి సినిమా అంటే వెయిట్ చేయాల్సిందేనని సర్ది చెప్పుకుంటున్నారు.

ఇదిలా ఉంటే రాజమౌళి గత చిత్రాలైన ‘బాహుబలి’ ('Baahubali), 'ఆర్.ఆర్.ఆర్.' (RRR) సినిమాలు ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు తెచ్చిపెట్టిన నేపథ్యంలో, ఈ సినిమాను అంతర్జాతీయ ప్రమాణాలతో నిర్మిస్తున్నారు. రూ.1000 కోట్లకు పైనే బడ్జెట్‌తో తెరకెక్కిస్తున్నారు. ఇప్పటికే హైదరాబాద్‌లోని రామోజీ ఫిల్మ్ సిటీలో రూ.100 కోట్ల ఖర్చుతో భారీ సెట్‌ను కూడా నిర్మిస్తున్నట్లు సమాచారం. అలాగే, ఆఫ్రికా, యూరప్‌లలో కూడా షూటింగ్ జరగనున్నట్లు తెలుస్తోంది. అయితే మహేష్ 50వ పుట్టినరోజు సందర్భంగా ఏదైనా అప్ డేట్ ఇస్తే బాగుంటుందని ఘట్టమనేని అభిమానులు ఆశపడుతున్నారు. కనీసం లుక్ అన్న రివీల్ చేయాలని రిక్వెస్టులు పెడుతున్నారు. చూస్తుంటే దర్శకుడు రాజమౌళి... మహేష్ బాబు ఫ్యాన్స్ ని సస్పెన్స్ తోనే చంపేలా ఉన్నాడని కామెంట్ చేసుకుంటున్నారు.. చూడాలి మరి ఏం జరుగుతుందో...

Read Also: Mahaveer Narasimha: ట్రెండ్ సెట్టర్ గా 'నరసింహ'

Read Also: సామ్‌ - రాజ్‌ మళ్లీ దొరికేశారు.. ఈసారి ఎక్కడంటే..

Updated Date - Jul 31 , 2025 | 05:23 PM