సౌత్ సినిమా+ -

వీడియోలు+ -

వెబ్ స్టోరీస్+ -

వైరల్+ -

Coolie Movie: కూలీపై కాపీ మరక.. ఒకటి కాదు రెండు సినిమాలు

ABN, Publish Date - Aug 03 , 2025 | 03:09 PM

సూపర్ స్టార్ రజినీకాంత్ (Rajinikanth) హీరోగా లోకేష్ కనగరాజ్ (Lokesh Kanagaraj) దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం కూలీ(Coolie). ఈ సినిమాపై అటు తమిళ్ తంబీలు మాత్రమే కాదు.. తెలుగువారు కూడా ఎన్నో అంచనాలను పెట్టుకున్నారు.

Coolie

Coolie Movie: సూపర్ స్టార్ రజినీకాంత్ (Rajinikanth) హీరోగా లోకేష్ కనగరాజ్ (Lokesh Kanagaraj) దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం కూలీ(Coolie). ఈ సినిమాపై అటు తమిళ్ తంబీలు మాత్రమే కాదు.. తెలుగువారు కూడా ఎన్నో అంచనాలను పెట్టుకున్నారు. సాధారణంగానే రజినీ సినిమా అంటే.. అన్ని ఇండస్ట్రీలో ఒక హైప్ ఉంటుంది. ఇక ఈసారి కూలీలో కేవలం రజినీ మాత్రమే కాకుండా ఒక్కో ఇండస్ట్రీ నుంచి ఒక్కో స్టార్ హీరో దిగుతున్నాడు. అమీర్ ఖాన్, అక్కినేని నాగార్జున, ఉపేంద్ర, సౌబిన్ షాహిర్, సత్యరాజ్, శృతి హాసన్ ఇలా స్టార్స్ అందరూ కలిసి ఆగస్టు 14 న ప్రేక్షకుల ముందుకు వస్తున్నారు.


ఇప్పటికే కూలీ చిత్రం నుంచి రిలీజైన పోస్టర్స్, టీజర్, సాంగ్స్ ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకున్నాయి. గత రాత్రి కూలీ ట్రైలర్ ను మేకర్స్ రిలీజ్ చేశారు. ట్రైలర్ ఆద్యంతం ఆకట్టుకుంటుంది కూడా. అయితే ట్రైలర్ పోస్టర్.. కొన్ని హాలీవుడ్ సినిమా పోస్టర్లకు కాపీ అని పలువురు నెటిజన్స్ సోషల్ మీడియాలో వైరల్ చేస్తున్నారు. ఇప్పటివరకు లోకేష్ నుంచి వచ్చిన ఏ సినిమా కూడా కనీసం పోస్టర్ కూడా కాపీ అని మార్క్ పడలేదు. మొదటిసారి లోకేష్ సినిమాపై కాపీ మరక పడింది. కూలీ ట్రైలర్ పోస్టర్.. అచ్చు గుద్దినట్లు రెండు హాలీవుడ్ సినిమా పోస్టర్లను గుర్తుచేస్తుంది.


2019లో రిలీజ్ అయిన గ్లాస్ అనే హాలీవుడ్ సినిమా పోస్టర్ కూడా కూలీ పోస్టర్ లానే కనిపిస్తుంది. గ్లాస్ ముక్కల మధ్య ఒక్కో నటుడును పెట్టి.. పోస్టర్ మొత్తం గ్లాస్ కనిపించేలా చేశారు. ఇక సేమ్ ఇలాంటిదే గతేడాది మేడమ్ వెబ్ అనే సినిమా పోస్టర్ లో కూడా రీపీట్ అయ్యింది. రెండు సినిమాల పోస్టర్లు ఒకేలా ఉన్నాయి. ఇప్పుడు కూలీ కూడా అలాగే ఉండడంతో లోకేష్ పోస్టర్ ఒక్కటేనా కథను కూడా కాపీ కొట్టాడా అనే అనుమానాలు తలెత్తుతున్నాయి. అయితే ఇప్పటివరకు కథకు సంబంధించి ఎలాంటి క్లూ తెలియకపోవడంతో ఇది కేవలం పోస్టర్ల వరకే కాపీ కొట్టారని టాక్ నడుస్తోంది. మరి ఇందులో నిజమెంత అనేది తెలియాలంటే సినిమా రిలీజ్ అయ్యేవరకు ఆగాల్సిందే.

Updated Date - Aug 03 , 2025 | 03:09 PM