Coolie: కూలీ నుంచి చికిటు వచ్చేసింది
ABN, Publish Date - Jun 25 , 2025 | 06:22 PM
సూపర్ స్టార్ రజినీకాంత్ (Rajinikanth) హీరోగా లోకేష్ కనగరాజ్ (Lokesh Kangaraj)దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం కూలీ (Coolie). సన్ పిక్చర్స్ ఈ సినిమాను భారీ బడ్జెట్ తో నిర్మిస్తుంది.
Coolie: సూపర్ స్టార్ రజినీకాంత్ (Rajinikanth) హీరోగా లోకేష్ కనగరాజ్ (Lokesh Kangaraj)దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం కూలీ (Coolie). సన్ పిక్చర్స్ ఈ సినిమాను భారీ బడ్జెట్ తో నిర్మిస్తుంది. ఇక ఈ సినిమాలో ఉపేంద్ర, నాగార్జున (Nagarjuna), సత్యరాజ్ లాంటి స్టార్స్ నటిస్తుండగా శృతి హాసన్ కూడా ఒక కీలక పాత్రలో నటిస్తుంది. ఇప్పటికే ఈ చిత్రం నుంచి రిలీజైన పోస్టర్స్ ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకున్నాయి. ఇక ఆగస్టు 14 న కూలీ రిలీజ్ కు రెడీ అవుతోంది. రిలీజ్ డేట్ దగ్గరపడుతుండటంతో ప్రమోషన్స్ మొదలుపెట్టిన మేకర్స్.. తాజాగా ప్రమోషనల్ మ్యూజిక్ వీడియోను రిలీజ్ చేశారు.
చికిటు అంటూ సాగే ఈ సాంగ్ ఆద్యంతం ఆకట్టుకుంటుంది. మ్యూజిక్ డైరెక్టర్ అనిరుధ్ రవిచందర్ మిగతా సినిమాలకు ఎలా కొట్టినా తలైవా సినిమాకు మాత్రం మ్యూజిక్ ఇచ్చిపడేస్తాడు. ఇప్పటికే జైలర్ తో దాన్ని నిరూపించిన అనిరుధ్ ఇప్పుడు కూలీ సినిమాతో మరోసారి నిరూపించుకున్నాడు. ఈ సాంగ్ లో ప్యూర్ తలైవా వైబ్ ఉందని చెప్పాలి. అనిరుధ్, రజినీతో పాటు ఈ సాంగ్ లో మరో స్టార్ హీరో టి రాజేందర్ కనిపించి ఇంకా హైప్ పెంచేశాడు.
అరివు అందించిన లిరిక్స్ చాలా క్యాచీగా ఉన్నాయి. ఇక అనిరుధ్, టి రాజేందర్ హుక్ స్టెప్స్ తో అదరగొట్టేశారు. మొత్తానికి ఈ సాంగ్ సోషల్ మీడియాను షేక్ చేయడం ఖాయం. అనిరుధ్ - రజినీ నుంచి వచ్చిన చార్ట్ బస్టర్స్ లో ఇది కూడా యాడ్ అవుతుంది. ప్రస్తుతం ఈ సాంగ్ యూట్యూబ్ ను షేక్ చేస్తోంది. ఈ సాంగ్ తోనే కూలీ ప్రమోషన్స్ మొదలుకానున్నట్లు తెలుస్తోంది. మరి ఈ సినిమాతో రజినీ ఎలాంటి విజయాన్ని అందుకుంటాడో చూడాలి.
Kannappa: శ్రీశైలం మల్లన్న చెంత.. కన్నప్ప