Chatha Pacha: మైత్రి మూవీ మేకర్స్ ద్వారా మరో మలయాళ సినిమా
ABN, Publish Date - Nov 25 , 2025 | 06:27 PM
మలయాళ యాక్షన్-కామెడీ చిత్రం 'చఠా పచా – రింగ్ ఆఫ్ రౌడీస్' సినిమా తెలుగులో రానుంది. జనవరి 2026లో విడుదల కానున్న ఈ చిత్రాన్ని మైత్రి మూవీ మేకర్స్ రెండు తెలుగు రాష్ట్రాల్లో విడుదల చేయనుంది.
మలయాళ యాక్షన్-కామెడీ చిత్రం 'చఠా పచా – రింగ్ ఆఫ్ రౌడీస్' (Chatha Pacha – Ring of Rowdies) సినిమా తెలుగులో రానుంది. జనవరి 2026లో విడుదల కానున్న ఈ చిత్రాన్ని మైత్రి మూవీ మేకర్స్ (Mythri MOvie Makers) రెండు తెలుగు రాష్ట్రాల్లో విడుదల చేయనుంది. నూతన దర్శకుడు అద్వైత్ నాయర్ దర్శకత్వం వహించగా, రీల్ వరల్డ్ ఎంటర్‌టైన్‌మెంట్ నిర్మించింది.అర్జున్ అశోకన్, రోషన్ మాథ్యూ, ఇషాన్ షౌక్కత్, విశాఖ్ నాయర్, పూజా మోహన్‌దాస్ ప్రధాన పాత్రలు పోషిస్తున్నారు. WWE రెజ్లింగ్, ప్రపంచవ్యాప్తంగా ఆరాధించే పాత్రల నుండి ప్రేరణ పొందిన ఈ చిత్రం భారీ రెజ్లింగ్ యాక్షన్ ఎంటర్టైనర్ ఇది. టీజర్, పోస్టర్లు, రెగ్యులర్ అప్‌డేట్‌లతో సినిమాకు బజ్ పెరిగింది.
ఈ చిత్రం పాన్ ఇండియా స్థాయిలో విడుదల కానుంది. కేరళలో దుల్కర్ సల్మాన్ నేతృత్వంలోని వేఫేరర్ ఫిల్మ్స్ రిలీజ్ చేయనుంది. ఈ చిత్రానికి ఉత్తర భారత థియేట్రికల్ హక్కులను ప్రముఖ ధర్మ ప్రొడక్షన్స్ సొంతం చేసుకుంది. PVR ఐనాక్స్ పిక్చర్స్ తమిళనాడు, కర్ణాటకలో రిలీజ్ చేస్తుంది. ఈ చిత్రం ప్రపంచవ్యాప్తంగా మలయాళం, తమిళం, తెలుగు, కన్నడ మరియు హిందీ భాషలలో 115 కంటే ఎక్కువ దేశాలలో విడుదల అవుతుంది. ప్రఖ్యాత బాలీవుడ్ త్రయం శంకర్-ఎహ్సాన్-లాయ్ సంగీతం సమకూర్చారు.రమేష్, రితేష్ రామకృష్ణన్, షిహాన్ షౌక్కత్, ఎస్. జార్జ్ మరియు సునీల్ సింగ్‌లు ఈ వెంచర్‌లో కీలక భాగస్వాములు.