Coolie: రజనీకాంత్.. కూలీ నుంచి దహా వచ్చేశాడు
ABN, Publish Date - Jul 03 , 2025 | 07:52 PM
రజనీకాంత్ లోకేశ్ కనగరాజ్ చిత్రం ‘కూలీ’ నుంచి ర్ అమీర్ ఖాన్ లుక్‌ను మేకర్స్ గురువారం రాత్రి రిలీజ్ చేశారు.
రజనీకాంత్ (Rajinikanth) కథానాయకుడిగా లోకేశ్ కనగరాజ్ (Lokesh Kanagaraj) తెరకెక్కిస్తున్న చిత్రం ‘కూలీ’ (Coolie). నాగార్జున, ఆమిర్ ఖాన్, ఉపేంద్ర, శ్రుతి హాసన్ కీలక పాత్రలు పోషిస్తున్నారు. కళానిధి మారన్ నిర్మిస్తున్నారు. ఆగస్టు 14న చిత్రం ప్రేక్షకుల ముందుకు రానుంది.
అయితే ఇప్పటివరకు సినిమాలో నటిస్తున్న ప్రధాన తరాగణం అందరి లుక్స్ రిలీజ్ చేసిన మేకర్స్ గురువారం సడన్‌గా ఇంటర్డ్యూసింగ్ దహా అంటూ బాలీవుడ్ స్టార్ అమీర్ ఖాన్ (AamirKhan ) లుక్‌ను రివీల్ చేసి అందరినీ అశ్చర్యానికి గురి చేశారు. ఈ మేరకు ఓ పోస్టర్ సైతం రిలీజ్ చేశారు. ఈ పోస్టర్లో సిగార్‌తాగుతూ అమీర్ లుక్ మెస్మరైజింగ్‌గా ఉంది. ప్రస్తుతం ఈ లుక్ సోషల్ మీడియాలె బాగా వైరల్ గా మారింది.
ఇదిలాఉంటే.. ఈ సినిమా తెలుగు థియేట్రికల్ రైట్స్‌ను డి.సురేశ్‌బాబు, సునీల్ నారంగ్, దిల్ రాజు భారీ ధరకు సొంతం చేసుకున్నారు. ఏషియన్ సురేశ్ ఎంటర్టైన్‌మెంట్స్ ద్వారా తెలుగు రాష్ట్రాల్లో సినిమా విడుదలవుతోంది. కాగా తాజాగా చిత్రం నుంచి ఇటీవల విడుదల చేసిన ఫస్ట్ సింగిల్ ‘చికిటు’అనే హుషారైన గీతంలో వింటేజ్ స్టైల్లో అదిరిపోయే స్టెప్పులతో అభిమానుల్ని ఖుషీ చేశారు రజనీకాంత్.