సౌత్ సినిమా+ -

వీడియోలు+ -

వెబ్ స్టోరీస్+ -

వైరల్+ -

Lavanya: మెగా కోడ‌లు.. కొత్త‌ త‌మిళ‌ మూవీ! పెళ్లికి ముందు చేస్తే.. ఇప్పుడు బ‌య‌ట‌కు వ‌చ్చింది

ABN, Publish Date - Sep 01 , 2025 | 05:52 PM

మెగా కోడ‌లు, వ‌రుణ్ తేజ్,శ్రీమ‌తి లావ‌ణ్య పెళ్లి త‌ర్వాత సినిమాల‌కు దూరంగా ఉంటూ రేర్‌గా సినిమాలు చేస్తున్నారు.

lavanya

మెగా కోడ‌లు, వ‌రుణ్ తేజ్ (Varun Tej) శ్రీమ‌తి లావ‌ణ్య (Lavanya) పెళ్లి త‌ర్వాత సినిమాల‌కు దూరంగా ఉంటూ రేర్‌గా సినిమాలు చేస్తున్నారు. ఈ కోవ‌లో గ‌త సంవ‌త్స‌రం తెలుగులో ఓ వెబ్ సిరీస్ చేయ‌గా తాజాగా స‌తీ లీలావ‌తి అనే ఓ సినిమా చేసింది. ఈ చిత్రం త్వ‌ర‌లోనే థియేట‌ర్ల‌కు రానుంది. అయితే ఇది ఓ వైపు ఇలా ఉండ‌గానే త‌ను పెళ్లికి ముందు న‌టించిన ఓ త‌మిళ చిత్రం త‌నాల్ (Thanal) అనేక అవాంతారాల‌ను దాటుకుని ఎట్ట‌కేల‌కు థియేట‌ర్ల‌కు వ‌చ్చేందుకు రెడీ అయింది.

ఈమ‌ధ్య‌ డీఎన్ఏ అనే చిత్రంతో ప్రేక్ష‌కుల ఎదుట‌కు వ‌చ్చి అదిరిపోయే బ్లాక్‌బ‌స్ట‌ర్ హిట్‌ కొట్టిన ఆధ‌ర్వ (Atharvaa) ఈ చిత్రం హీరో. ర‌వీంద్ర మాద‌వ ( Ravindra Madhava) ఈ చిత్రానికి ద‌ర్శ‌క‌త్వం వ‌హించాడు. ఔట్ అండ్ స‌ర్వైవ‌ల్ థ్రిల్ల‌ర్ త‌ర‌హా జాన‌ర్‌లో రూపొందిన ఈ సినిమా పోస్ట్ ప్రొడక్ష‌న్ కార్య‌క్ర‌మాలు పూర్తి చేసుకోగా సెప్టెంబ‌ర్ 12న థియేట‌ర్ల‌కు వ‌స్తుంది. ఈ నేప‌థ్యంలో మేక‌ర్స్ తాజాగా ఈ మూవీ ట్రైల‌ర్ రిలీజ్ చేశారు.

ట్రైల‌ర్‌ను బ‌ట్టి చూస్తే .. పోలీసుకు, ఓ భారీ గ్యాంగ్‌కు మ‌ధ్య జ‌రిగే సినిమా అని తెలుస్తోండ‌గా ఓ కేసు విష‌యంలో పోలీసుల బెటాలియ‌న్ ఓ ప్రాంతానికి వెళ్ల‌డం, అప్ప‌టికే ఆ ప్రాంతాన్ని త‌మ అధీనంలో ఉంచుకున్న రౌడీ గ్యాంగ్ పోలీసుల‌పై దొమ్మికి దిగి క‌నిపించిన ప్ర‌తి ఒక్క‌రిని చంపుకుంటూ వెళతారు. ఈ ప‌రిస్థితుల్లో పోలీసులు అక్క‌డి నుంచి ఎలా స‌ర్వైవ్ అవ‌గ‌లిగారు, రౌడీ మూక‌ల ఆట ఎలా క‌ట్టించార‌నే ఆస‌క్తిక‌ర‌మైన క‌థ‌ క‌థ‌నాల‌తో సినిమాను తెర‌కెక్కించారు.

అయితే లావ‌ణ్య, వ‌రుణ్ తేజ్‌ను పెళ్లి చేసుకోక ముందు న‌టించిన ఈ చిత్రం కాస్త ఆల‌స్య‌మవుతూ వ‌చ్చి ఇప్పుడుపెళ్లై రెండేండ్లు గ‌డిచి రేపో మాపో బేబీ వ‌చ్చే స‌మ‌యంలో రిలీజ్ అవుతుండ‌డంతో ఇప్పుడు ఈ అంశం వార్త‌ల్లో నిలిచింది. మ‌రో విష‌య‌మేమిటంటే. లావ‌ణ్య హ‌స్బెండ్ అదేనండి వ‌రుణ్ తేజ్ న‌టించిన గ‌ద్ద‌ల‌కొండ గ‌ణేశ్ చిత్రంలో ఆధ‌ర్వ కీ రోల్ చేశాడు.

Updated Date - Sep 01 , 2025 | 05:55 PM