సౌత్ సినిమా+ -

వీడియోలు+ -

వెబ్ స్టోరీస్+ -

వైరల్+ -

Tamil Movies: చూసేవి రెండు.. రిలీజ్ అయ్యేది ప‌న్నెండు! త‌మిళ‌ థియేట‌ర్ల‌లో.. సినిమాలే సినిమాలు

ABN, Publish Date - Aug 01 , 2025 | 11:22 AM

ఆగస్టులో మొదటి శుక్రవారం త‌మిళ‌నాట‌ ఏకంగా ఎనిమిది చిత్రాలు విడుదల‌య్యాయి.

tamil

ఆగస్టులో మొదటి శుక్రవారం త‌మిళ‌నాట‌ ఏకంగా ఎనిమిది చిత్రాలు విడుదల‌య్యాయి. ఇప్పటివరకు అధికారికంగా ప్రకటించిన వివరాల మేరకు నేడు ఆగస్టు ఒకటో తేదీ అక్యూస్డ్ (Accused), బోగి (Bhoghee), ‘బ్లాక్‌మెయిల్‌’, ‘హౌస్‌మేట్స్ (House Mates), మిస్టర్‌ జూ కీపర్ (Mr Zoo Keeper), చెన్నై ఫైల్స్‌ ముదల్‌ పక్కం (Muthal Pakkam), ‘సరెండర్ (Surrender), ఉసురే (Usurae) వంటి చిత్రాలున్నాయి.

దీంతో ఒక్కో చిత్రానికి గరిష్టంగా వంద థియేటర్లు చొప్పున కేటాయిస్తే మొత్తంగా 800 థియేటర్లు కావాల్సి ఉంటుంది. కానీ, వీటిలో పెద్ద హీరోలు నటించిన లేదా భారీ బడ్జెట్‌ చిత్రాలేవీ లేకపోవడంతో ఈ సినిమాలకు థియేటర్ల కేటాయింపు పెద్ద సమస్య కాలేదని సినీ వర్గాలు పేర్కొన్నాయి. అయితే ఈ స్ట్రెయిటం త‌మిళ చిత్రాల‌తో పాటు విజ‌య్ దేవ‌క‌రొండ కింగ్డ‌మ్‌, బాలీవుడ్ నుంచిఅజ‌య్ దేవ‌గ‌న్ స‌న్నాఫ్ స‌ర్దార్‌, ద‌ఢ‌క్‌2, మ‌ల‌యాలం నుంచి ప‌లు సినిమాలు కూడా ఇదే రోజు విడుద‌ల అవుతుండ‌డం విశేషం.

ఇదిలావుంటే, ఈ యేడాది జూలై 30వ తేదీ వరకు సుమారుగా 150 చిత్రాల వరకు విడుదలయ్యాయని కోలీవుడ్‌ వర్గాలు పేర్కొంటున్నాయి. ఆ లెక్కన చూస్తే 2025 సంవత్సరాంతానికి అంటే వచ్చే ఐదు నెలల్లో మరో వంద చిత్రాలు విడుదలైతే మొత్తంగా 250 చిత్రాలు రిలీజ్‌ కావొచ్చని అంచనా వేస్తున్నారు. వాస్తవానికి థియేటర్లకు వచ్చే ప్రేక్షకుల సంఖ్య నానాటికీ తగ్గిపోతోంది. కానీ థియేటర్లలో రిలీజ్‌ అయ్యే సినిమాల సంఖ్య మాత్రం తగ్గకపోవడం గమనార్హం.

Updated Date - Aug 01 , 2025 | 11:22 AM