Action King Arjun: మఫ్టీపోలీస్ వచ్చేస్తున్నాడు...

ABN , Publish Date - Nov 05 , 2025 | 06:14 PM

యాక్షన్ కింగ్ అర్జున్, ఐశ్వర్య రాజేశ్‌ తొలిసారి కలిసి నటించిన సినిమా 'మఫ్టీ పోలీస్'. నవంబర్ 21న ఈ సినిమాను దక్షిణాది భాషల్లో విడుదల చేయబోతున్నారు.

Mufti Police Movie

యాక్షన్ కింగ్ అర్జున్ (Action King Arjun), ఐశ్వర్య రాజేష్ (Aishwarya Rajesh) లీడ్ రోల్స్ చేస్తున్న సినిమా 'మఫ్టీ పోలీస్' (Mufti Police). జి. అరుల్ కుమార్ సమర్పణలో జి.ఎస్. ఆర్ట్స్ బ్యానర్ లో నిర్మితమౌతున్న ఈ సినిమాతో దినేష్‌ లెట్చుమనన్ (Dinesh Letchumanan) దర్శకుడిగా పరిచయం అవుతున్నాడు. ఇటీవల 'మఫ్టీ పోలీస్' టీజర్ విడుదలైంది. అప్పటి నుండి సినిమా అంచనాలు పెరిగాయి. ఈ క్రైమ్ థ్రిల్లర్ ప్రేక్షకుల ఊహకు అందని ట్విస్ట్ లు ఉంటాయని తెలుస్తోంది. ఇందులో అర్జున్ చెప్పే 'కొన్నిసార్లు చట్టాన్ని దాటి న్యాయం ఉంటుంది. ఇంకొన్నిసార్లు న్యాయాన్ని దాటి ధర్మం ఉంటుంది. కానీ మొత్తం లెక్కవేసి చూస్తే చివరికి ధర్మమే గెలుస్తుంది' అనే డైలాగ్ మూవీ సెంటర్ పాయింట్ ను తెలియచేసే విధంగా ఉంది. ఎప్పటి లానే యాక్షన్ కింగ్ అర్జున్ అద్భుతమైన పెర్ఫార్మెన్స్ చేశారు. ఐశ్వర్య రాజేష్ క్యారెక్టర్ లో ఇంటెన్సిటీ కనిపిస్తోంది. ఈ యేడాది సంక్రాంతికి వచ్చిన 'సంక్రాంతికి వస్తున్నాం' మూవీలో మిడిల్ క్లాస్ హౌస్ వైఫ్‌ గా నవ్వుల పువ్వులు పూయించిన ఐశ్వర్య రాజేష్‌ ఇందులో పూర్తి భిన్నమైన పాత్రను పోషించినట్టు అర్థమౌతోంది.


TKN_DG_13_TEASER OUT NOW_01_FOR ARTICLE.jpg

'మఫ్టీ పోలీస్' చిత్రంలో బిగ్ బాస్ ఫేమ్ అభిరామి (Abhirami), రామ్‌కుమార్, జి. కె. రెడ్డి, పి. ఎల్. తేనప్పన్, లోగు, వేల రామమూర్తి, తంగదురై, ప్రాంక్‌స్టర్ రాహుల్, ఓ.ఎ.కె. సుందర్ తదితరులు ఇతర ప్రధాన పాత్రలను పోషించారు. శరవణన్ అభిమన్యు సినిమాటోగ్రఫీని నిర్వహిస్తున్నారు, ఆశివాగన్ సంగీతం అందిస్తున్నారు. లారెన్స్ కిషోర్ ఎడిటర్. అరుణ్ శంకర్ ఆర్ట్ డైరెక్టర్ర. విశేషం ఏమంటే... అర్జున్, ఐశ్వర్య రాజేష్ స్క్రీన్ షేర్ చేసుకోవడం ఇదే మొదటి సారి. ఈ సినిమాను నవంబర్ 21న తమిళం, తెలుగు, మలయాళ, కన్నడ భాషలలో ఒకేసారి విడుదల చేస్తామని మేకర్స్ తెలిపారు.

Also Read: Kodama Simham: ‘కొదమ సింహం’ రీ-రిలీజ్

Also Read: Sree Vishnu: వెండితెరపై ప్రతి యువకుడి కథ...

Updated Date - Nov 05 , 2025 | 06:17 PM