Arjun Das: 'డాన్ 3'లో అర్జున్ దాస్

ABN , Publish Date - Sep 23 , 2025 | 06:54 PM

ఒక్క ట్రైలర్ తోనే టాక్ ఆఫ్ ది ఇండియన్ ఇండస్ట్రీ అయిపోయాడు ఆ యాక్టర్. కొన్ని సెకండ్లలో కనిపించి ఏకంగా బీటౌన్ లో బిగ్ చాన్సే కొట్టేశాడు. అది తెలిసిన వారంతా ఇప్పుడు అదృష్టమంటే ఆ యాక్టర్ దే అంటూ ఆశ్చర్యపోతున్నారు.

కోలీవుడ్‌లో తనదైన నటనా శైలితో గుర్తింపు పొందిన అర్జున్ దాస్ (Arjun Das) ఇప్పుడు టాలీవుడ్‌లో సంచలనం సృష్టిస్తున్నాడు. పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ (Pawan Kalyan) హీరోగా నటిస్తున్న ఓజీ ట్రైలర్ ( OG Trailer) విడుదలైనప్పటి నుంచి అర్జున్ దాస్ పాత్ర అభిమానులను ఎంతగానో ఆకట్టుకుంటోంది. 'ఖైదీ' (Khaidi) ,' మాస్టర్' (Master) వంటి తమిళ చిత్రాలతో ఇప్పటికే ప్రేక్షకుల మనసు గెలుచుకున్నప్పటికీ అర్జున్, 'ఓజీ'తో మరో మెట్టు ఎక్కాడు.‌ జస్ట్ ట్రైలర్ తోనే సోషల్ మీడియాలో వైరల్‌గా మారిన అర్జున్ దాస్.. క్రేజ్ ఇప్పుడు బాలీవుడ్‌ వరకూ పాకినట్టు తెలుస్తోంది.


బాలీవుడ్ మీడియా సమాచారం ప్రకారం.. ఫర్హాన్ అక్తర్ (Farhan Akhtar ) దర్శకత్వంలో రూపొందుతున్న 'డాన్ 3' (Don 3) చిత్రంలో అర్జున్ దాస్ విలన్‌గా నటించబోతున్నట్టు తెలుస్తోంది. ఈ చిత్రంలో రణవీర్ సింగ్ ( Ranveer Singh) హీరోగా కనిపించనున్నాడు. ఓజీ లో అర్జున్ నటనా నైపుణ్యాన్ని గమనించి ఫర్హాన్ అతని కోసం ప్రత్యేకమైన పాత్రను రూపొందించినట్లు సమాచారం. ఈ పాత్రలో అర్జున్ హిమేష్ మరింత పెరుగుతుందని అంటున్నారు.

ఏదేమైనా ఒక సినిమాలో నటిస్తూ.. ఆ సినిమా విడుదల కాకముందే మరో సినిమాలో ఛాన్స్ పొందిన ఘనత అర్జున్ దాస్ కే దక్కింది. ఒకవేళ గనుక ఈ సినిమా ఓకే అయితే ఈ యాక్టర్ చేసే మొదటి బాలీవుడ్ సినిమా ఇదే కానుంది. ఈ చిత్రంతో అర్జున్ దాస్ తన నటనా ప్రతిభను జాతీయ స్థాయిలో చాటే అవకాశం ఉంది. అతని కెరీర్ ఇక ఎలాంటి మలుపులు తీసుకుంటుందో, ఈ టాలెంటెడ్ నటుడు బాలీవుడ్‌లో ఎలాంటి సంచలనం సృష్టిస్తాడో చూడాలి.

Read Also: Sai Pallavi: బికినీలో సాయి పల్లవి.. చీర కట్టుకొని స్విమ్ చేస్తారా

Read Also: Kantar1 Trailer : కాంతార-1 ట్రైలర్... 24 గంటల్లో 107 మిలియన్ వ్యూస్

Updated Date - Sep 23 , 2025 | 07:02 PM