సౌత్ సినిమా+ -

వీడియోలు+ -

వెబ్ స్టోరీస్+ -

వైరల్+ -

Demonte Colony3: అంతం లేని భయం.. తిరిగి వస్తోంది

ABN, Publish Date - Jul 09 , 2025 | 10:57 AM

ఇప్ప‌టికే రెండు భాగాలుగా వ‌చ్చిన త‌మిళ‌ హ‌ర్ర‌ర్ థ్రిల్ల‌ర్‌ డీమాంటే కాలనీ సినిమా మ‌రోసారి వార్త‌ల్లో నిలిచింది.

Demonte Colony

ఇప్ప‌టికే రెండు భాగాలుగా వ‌చ్చి భయానికి నిర్వచనంగా నిలిచిన త‌మిళ‌ హ‌ర్ర‌ర్ థ్రిల్ల‌ర్‌ డీమాంటే కాలనీ (Demonte Colony) సినిమా మ‌రోసారి వార్త‌ల్లో నిలిచింది. అరుళ్‌ నిధి (Arulnithi), ప్రియా భవానీ శంకర్ (Priya Bhavani Shankar) హీరోహీరోయిన్లుగా ఈ సిరీస్‌లో డిమాంటే కాల‌నీ 2 చిత్రం గ‌తేడాది ఆగ‌ష్ట్ 15న‌ ప్రేక్ష‌కుల ముందుకు వ‌చ్చి మంచి విజ‌యం సాధించింది.

అరుణ్‌పాండ్యన్‌, మీనాక్షి గోవింద రాజన్‌, అర్చన, ముత్తుకుమార్ కీల‌క పాత్రలు పోషించారు. 2015లో వ‌చ్చిన మొద‌టి భాగానికి సీక్వెల్‌గా వ‌చ్చిన ఈ సినిమా సాంకేతికంగా, కథాపరంగా, విజువల్ ఎఫెక్ట్స్ పరంగా అద్భుతంగా రూపొంది జ‌నాల‌ను బాగానే బ‌య పెట్టి మంచి థ్రిల్‌ను పంచింది. సుమారు రూ.90 కోట్ల మేర వ‌సూళ్లను సైతం రాబ‌ట్టింది. ఆపై ఓటీటీలోనూ వ‌చ్చి అంత‌కుమించి ఆద‌ర‌ణ‌న‌ను ద‌క్కించుకుంది.

అయితే.. ఈ సినిమా ఎండింగ్‌లోనే ద‌ర్శ‌కుడు అజయ్ జ్ఞానముత్తు మూడవ‌ భాగానికి సంబంధించిన ఇంట్రెస్టింగ్‌ లీడ్ ఇచ్చారు. దీంతో థ‌ర్డ్ ఫార్ట్ పై అంచ‌నాలు ఓ రేంజ్‌లో ఉన్నాయి. కాగా ఇప్పుడు ఈ సీక్వెల్‌లో మూడ‌వ భాగాన్ని డిమాంటే కాల‌నీ ది ఎండ్ టూ పార్ అవే (Demonte Colony 3: The End Is Too Far Away) అనేక్యాప్స‌న్‌తో ఇటీవ‌ల మేక‌ర్స్ పూజా కార్య‌క్ర‌మాల‌తో ప్రారంభించారు. గ‌త సీక్వెల్‌లో న‌టించిన అరుళ్‌ నిధి (Arulnithi), ప్రియా భవానీ శంకర్ (Priya Bhavani Shankar), మీనాక్షి గోవిందరాజన్ ల‌తో పాటు మ‌ల‌యాళ న‌టి మియా జార్జ్‌, అర్చ‌నా ర‌వి చంద్ర‌న్ కొత్త‌గా ఈ సినిమాలో భాగం కానున్నారు.

కాగా ఈ సారి ఈ చిత్రం కోసం రూ.32 కోట్ల బ‌డ్జెట్‌తో నిర్మిస్తుండ‌గా కీల‌క స‌న్నివేశాలు యూరోపియన్ దేశాలు ముఖ్యంగా మాల్టాలో చిత్రీకరించబోతున్నారు. అంతేగాక అంత‌ర్జాతీయ స్థాయిలో ఆడియ‌న్స్ ను ఆక‌ట్టుకునేలా క‌థ‌ను తీర్చిదిద్దిన‌ట్టు స‌మాచారం. గ‌త సినిమాకు ప‌ని చేసిన శ్యామ్‌ సీఎస్ ఈ చిత్రానికి కూడా సంగీతం అందించ‌నున్నాడు. 2026, ఆగ‌ష్టులో ఈ మూవీ డిమాంటే కాల‌నీ ది ఎండ్ టూ పార్ అవే (Demonte Colony 3: The End Is Too Far Away) థియేట‌ర్ల‌లోకి రానుంది.

Updated Date - Jul 09 , 2025 | 10:57 AM