Kantara Chapter1: కాంతారా థియేటర్లోకి ‘పంజూర్లి’.. షాక్ అయిన ప్రేక్షకులు
ABN, Publish Date - Oct 05 , 2025 | 01:18 PM
దిండిగల్‌లో ‘కాంతార చాప్టర్ 1’ స్క్రీనింగ్‌లో ఓ ఫ్యాన్ దైవ వేషధారణలో హాజరై ప్రేక్షకులను ఆశ్చర్యపరిచాడు.
‘కాంతార’ సినిమా అంటేనే ఒక మిస్టిక్ ఎమోషన్. ఈ కోవలోనే రిషబ్ శెట్టి (Rishab Shetty) కొత్తగా తెరకెక్కించిన కాంతార చాప్టర్ 1 (Kantara Chapter1) ఈ ఫ్రాంచైజీకి ఉన్న క్రేజ్ ఏ రేంజ్‌లో ఉందో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. తాజాగా ‘కాంతార చాప్టర్ 1’ సినిమా స్క్రీనింగ్ సందర్భంగా తమిళనాడులోని దిండిగల్ (Dindigul)లో అద్భుత దృశ్యం చోటుచేసుకుంది.
సినిమా ముగిసిన వెంటనే ప్రేక్షకులు థియేటర్ నుంచి బయటకు వస్తుండగా, ఓ యువ అభిమాని ‘పింజూర్లి’ వేష ధారణలో వచ్చి థియేటర్ అంతా కలియ తిరిగి ప్రేక్షకులను ఆశ్యర్య పరిచాడు. ముఖంపై ఎర్రటి పూత, తలపై కిరీటం, చేతిలో కత్తి, సంప్రదాయ వేషధారణతో పూర్తిగా అచ్చం సినిమాలో చూపించిన తరహాలో ఉండటంతో ఆ క్షణం థియేటర్ లో హంగామా నెలకొంది.
అయితే.. అందరూ ఆ యువకుడి చుట్టూ చేరి ఫొటోలు, వీడియోలు తీసుకుంటూ మెరిసి పోయారు. ఇదిలాఉంటే.. ఆ వ్యక్తి రిషబ్ శెట్టి టీమ్ నుంచి వచ్చాడేమోనని కొందరు ప్రేక్షకులు అనుమానించారు. కానీ అతను సాధారణ అభిమాని అని కాంతార సినిమాపై అభిమానం, మోజుతో అలా ఈ ప్రత్యేక వేషం వేసుకున్నాడని తెలిసి అంతా షాకయ్యారు. ఈ వీడియో కాస్త నెట్టింట్లోకి రావడం, వైరల్ కావడం చకచకా జరిగిపోయాయి. ఆ వీడియో చూసిన వారు చాలా మంది “ఇది కేవలం సినిమా కాదు, సంస్కృతి!” అంటూ కామెంట్లు చేస్తున్నారు. రిషబ్ శెట్టి (Rishab Shetty) కి థ్యాంక్స్ చెబుతున్నారు.