సౌత్ సినిమా+ -

వీడియోలు+ -

వెబ్ స్టోరీస్+ -

వైరల్+ -

Dhanush: గ్రామస్తులకు.. హీరో ధనుష్ విందు

ABN, Publish Date - Oct 06 , 2025 | 05:40 PM

కుబేర వంటి బ్లాక్ బ‌స్ట‌ర్ చిత్రం త‌ర్వాత త‌మిళ స్టార్ హీరో ధ‌నుష్ స్వ‌యంగా ద‌ర్శ‌క‌త్వం చేస్తూ న‌టించిన చిత్రం ఇడ్లీ క‌డై.

Dhanush

కుబేర వంటి బ్లాక్ బ‌స్ట‌ర్ చిత్రం త‌ర్వాత త‌మిళ స్టార్ హీరో ధ‌నుష్ (Dhanush) స్వ‌యంగా ద‌ర్శ‌క‌త్వం చేస్తూ న‌టించిన చిత్రం ఇడ్లీ క‌డై (idli kadai). తెలుగులో ఇడ్లీ కొట్టుగా ప్రేఓకుల ముందుకు వ‌చ్చింది. రిలీజ్ అయిన తొలి రోజు నుంచే మంచి పాజిటివ్ టాక్ తెచ్చుకున్న ఈ సినిమా త‌మిళ నాట భారీ విజ‌యం సొంతం చేసుకుంది.

ఈ సంద‌ర్భాన్ని పుర‌స్క‌రించుకుని హీరో ధ‌నుష్ త‌న స్వ‌గ్రామ‌మైన తేని (Theni) జిల్లా శంకాపురం గ్రామంలో తమ‌ కులదైవమైన కరుప్ప స్వామి (Karuppasamy Temple) ఆలయానికి త‌న ఇద్ద‌రు కుమారులు, త‌ల్లీదండ్రులు, సోద‌రుడు సెల్వ‌ రాఘ‌వ‌న్‌తో క‌లిసి వ‌చ్చి ప్రత్యేక పూజలు చేశారు.


ఆపై గ్రామ ప్రజలకు మాంసాహారంతో విందు భోజనం ఏర్పాటు చేశారు. ఆపై వారితో కలిసి ఆయన భోజనం చేశారు. ఇందుకు సంబంధించిన ఫొటోలు, వీడియోలు సోష‌ల్ మీడియాలో బాగా వైర‌ల్ అవుతున్నాయి. మీరూ ఓ లుక్కేయండి మ‌రి.

వీటిని చూసిన వారంతా ధ‌నుష్ న‌టుడిగా హాలీవుడ్ అంత స్థాయికి ఎదిగినా ఇప్ప‌టికీ త‌న సొంత ఊరు, కుల దైవాన్ని మ‌రువ‌కుండా ఇలా సాధార‌ణ మ‌నిషిలాగా వ‌చ్చి అంద‌రితో క‌లిసిపోయి పూజ‌లు చేయ‌డం, భోజ‌నం చేయ‌డం అస‌లు న‌మ్మ‌లేక పోతున్నామంటున్నారు. ధ‌నుష్‌ను (Dhanush) చూసి చాలామంది ఎంతో నేర్చుకోవాల్సి ఉంద‌ని హిత‌వు ప‌లుకుతున్నారు.

Updated Date - Oct 06 , 2025 | 06:17 PM