సౌత్ సినిమా+ -

వీడియోలు+ -

వెబ్ స్టోరీస్+ -

వైరల్+ -

Nayanthara: నయనతార బర్త్‌డే గిఫ్ట్.. రూ.10 కోట్ల లగ్జరీ కారు

ABN, Publish Date - Nov 20 , 2025 | 09:13 AM

నయనతార 41వ పుట్టినరోజు సంద‌ర్భంగా విఘ్నేష్‌ శివన్ రూ.10 కోట్ల విలువైన రోల్స్‌రాయిస్‌ బ్లాక్‌ బ్యాడ్జ్‌ స్పెక్టర్‌ను బర్త్‌డే గిఫ్ట్‌గా ఇచ్చారు.

Nayanthara

అగ్ర హీరోయిన్‌ నయనతార (Nayanthara) తన 41వ పుట్టిన రోజు వేడుకలను ఈ నెల 18వ తేదీన జరుపుకోగా, ఈ సందర్భంగా ఆమె భర్త, సినీ దర్శకుడు విఘ్నేష్‌ శివన్ (Vignesh Shivan) ఖరీదైన లగ్జరీ కారు బహుమతిగా ఇచ్చారు. రోల్స్‌ రాయిస్‌ బ్లాక్‌ బ్యాడ్జ్‌ స్పెక్టర్ (Rollsroyce Black Badge Spectre) ను నయనకు బర్త్‌డే గిఫ్ట్‌గా ఇచ్చి విషెస్‌ చెప్పారు.

ఈ కారు విలువ రూ.10 కోట్లు ఉంటుందన్నది కోలీవుడ్‌ వర్గాల సమాచారం. 2023లో నయనకు మెర్సిడెస్‌ మేబాచ్‌ కారును, 2024లో మెర్సిడెస్‌ బెంజ్‌ మేబ్యాక్‌ జీఎల్‌ఎస్‌ 600 కారు బహుమతిగా ఇచ్చారు. కాగా, 41వ వసంతంలోకి అడుగుపెట్టిన నయనతారకు పలువురు సినీ ప్రముఖులు, సహచర నటీనటులు సోషల్‌ మీడియా వేదికగా పుట్టిన రోజు శుభాకాంక్షలు తెలిపారు.

Updated Date - Nov 20 , 2025 | 09:23 AM