Meena Sagar: బీజేపీలో చేరనున్న నటి మీనా
ABN, Publish Date - Jun 25 , 2025 | 03:40 PM
అందాల నటి మీనా (Meena) గురించి తెలుగు ప్రేక్షకులకు ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. బాలనటిగా ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చిన మీనా..
Meena Sagar: అందాల నటి మీనా (Meena) గురించి తెలుగు ప్రేక్షకులకు ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. బాలనటిగా ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చిన మీనా.. హీరోయిన్ గా, స్టార్ హీరోయిన్ గా తెలుగు, తమిళ భాషల్లో మంచి గుర్తింపును తెచ్చుకుంది. ఇక కెరీర్ పీక్స్ లో ఉన్నప్పుడే ఆమె సాగర్ అనే వ్యక్తిని వివాహమాడి కొన్నేళ్ళు సినిమలకు దూరమైంది. ఇక ఈ జంటకు నైనీక అనే కూతురు కూడా ఉంది. ఆ చిన్నారి కూడా బాలనటిగా ఇండస్ట్రీకి ఎంట్రీ ఇచ్చింది. దళపతి విజయ్ హీరోగా అట్లీ దర్శకత్వంలో తెరకెక్కిన తేరి సినిమాలో విజయ్ కూతురుగా నైనీక నటించి మెప్పించింది.
ఇక కూతురు పెద్దది కావడంతో మీనా కూడా రీఎంట్రీ ఇచ్చి సహాయనటిగా నటించడం మొదలుపెట్టింది. ఇక ఆ సమయంలోనే మీనా బారత సాగర్ అనారోగ్యంతో మరణించిన విషయం తెల్సిందే. అతి చిన్న వయస్సులోనే భర్తను పోగొట్టుకున్న మీనా క్రుంగిపోకుండా.. కూతురు కోసం సంపాదించడం మొదలుపెట్టింది. తెలుగు, తమిళ, కన్నడ భాషల్లో నటిస్తూ బిజీగా మారింది.
ఇక తాజాగా మీనా రాజకీయాల్లోకి ఎంట్రీ ఇస్తుందని వార్తలు వినిపిస్తున్నాయి. దానికి కారణం ఈ మధ్యనే మీనా.. ఢిల్లీ వెళ్ళి ఉప రాష్ట్రపతి జగదీప్ ధన్ ఖడ్ ను కలవడం జరిగింది. ఈ విషయాన్ని ఆమె స్వయంగా తన సోషల్ మీడియా ద్వారా తెలిపింది. రాష్ట్రపతి జగదీప్ ధన్ ఖడ్ ను కలవడం చాలా గౌరవంగా ఉందని, ఆయనను చూసి చాలా నేర్చుకున్నాను అని చెప్పుకొచ్చింది.
' మిమ్మల్ని కలవడం చాలా గౌరవంగా భావిస్తున్నాను సర్. మీ దగ్గరనుంచి నేను చాలా నేర్చుకున్నాను. అవన్నీ నాకు భవిష్యత్ ను ఎంతో నమ్మకంగా నడిపించడంలో సహాయపడతాయని నేను నమ్ముతున్నాను. మీ విలువైన సమయం నాకు ఇచ్చినందకు ధన్యవాదాలు' అంటూ చెప్పుకొచ్చింది. ఇక ఈ ఫోటో చూసినవారందరూ.. మీనా బీజేపీలో చెరబోతుందని మాట్లాడుకుంటున్నారు. అసలు నటి అయిన మీనా.. ఉప రాష్ట్రపతి జగదీప్ ధన్ ఖడ్ ను కలవడం వెనుక ఆంతర్యం ఏంటి.. ? నిజంగానే ఆమె రాజకీయాల్లోకి వస్తుందా.. ? ఆమె వెనుక ఉన్నది ఎవరు.. ? అని ఆరాలు తీయడం మొదలు పెట్టారు.
Vijay Antony: ఇండస్ట్రీలో డ్రగ్స్ వాడకం కొత్తేమి కాదు.. శ్రీకాంత్ అరెస్ట్ పై విజయ్ స్పందన