సౌత్ సినిమా+ -

వీడియోలు+ -

వెబ్ స్టోరీస్+ -

వైరల్+ -

Kayadu Lohar: గ్లామర్‌.. పాత్రలు కావాలి

ABN, Publish Date - Oct 26 , 2025 | 09:58 PM

‘డ్రాగన్‌’ మూవీతో కోలీవుడ్‌లోకి అడుగుపెట్టిన కయదు లొహర్ ఇపుడు గ్లామర్‌ పాత్రలపై ఆసక్తి చూపుతోంది.

Kayadu Lohar

‘డ్రాగన్‌’ మూవీతో కోలీవుడ్‌లోకి అడుగుపెట్టిన కయదు లొహర్ (Kayadu Lohar) ఇపుడు గ్లామర్‌ పాత్రలపై ఆసక్తి చూపుతోంది. సినీ ఇండస్ట్రీలో పది కాలాల పాటు మనుగడ కొనసాగించాలంటే చీరకట్టులోనే కనిపిస్తే సరిపోదని, గ్లామర్‌ పాత్రల్లో కూడా చేయాలన్న సత్యాన్ని గ్రహించారు.

ఇందులో భాగంగా తొలుత ఎక్స్‌పోజింగ్‌ చేస్తూ ఒక ప్రత్యేక ఫొటో, వీడియో షూట్‌ చేసి వాటిని సోషల్‌ మీడియాలో షేర్‌ చేయాలన్న ఆలోచనలో ఉన్నారు.

వాస్తవానికి ‘డ్రాగన్‌’ తర్వాత కోలీవుడ్‌లో మంచి క్రేజ్‌ తెచ్చుకున్న కయదు.. ఆ తర్వాత కొన్ని వివాదాస్పద చర్చల్లో చిక్కుకున్నారు. దీంతో ఆమెను తమ చిత్రాల్లో ఎంపిక చేసుకునేందుకు దర్శక నిర్మాతలు వెనుకంజ వేశారు.

ఇపుడు ‘ఇదయం మురళి’ (IdhayamMurali), తెలుగులో విశ్వ‌క్ సేన్ ఫంకీ (Funky) అనే చిత్రంలో నటించగా అవి త్వరలోనే విడుదలకానుంది. ఆ తర్వాత విశాల్‌, జీవీ ప్రకాష్‌ చిత్రాల్లో నటించేందుకు ఒప్పందం కుదుర్చుకున్నారు.

అంతేకాకుండా, పెద్ద హీరోల సరసన డ్యూయెట్లు పాడాలని, భారీ పారితోషికాన్ని అందుకోవాలన్న తపనలో కయదు ఉన్నారు. అందుకే ఆమె గ్లామర్‌ పాత్రలు, ఎక్స్‌పోజింగ్‌ వైపు మొగ్గు చూపుతున్నారు.

Updated Date - Oct 26 , 2025 | 09:58 PM