సౌత్ సినిమా+ -

వీడియోలు+ -

వెబ్ స్టోరీస్+ -

వైరల్+ -

Ashika Ranganath Achala: ఆషికా కుటుంబంలో విషాదం.. క‌జిన్ ఆత్మ‌హ‌త్య‌

ABN, Publish Date - Dec 01 , 2025 | 09:51 AM

ప్ర‌ముఖ న‌టి నా సామిరంగా ఫేమ్ ఆషికా రంగ‌నాథ్ (Ashika Ranganath) కుటుంబంలో తీవ్ర విషాదం నెల‌కొంది.

Ashika Ranganath Achala

ప్ర‌ముఖ న‌టి నా సామిరంగా ఫేమ్ ఆషికా రంగ‌నాథ్ (Ashika Ranganath) కుటుంబంలో తీవ్ర విషాదం నెల‌కొంది. ఆమె క‌జిన్ హాసన్ ప్రాంతానికి చెందిన అచ‌ల (22) (Achala) బెంగ‌ళూరు (Bengaluru) లోని బంధువుల ఇంట్లో ఆత్మ‌హ‌త్య చేసుకుంది. ఈ ఘటన న‌వంబ‌ర్ 22న పుట్టెనహళ్లి పోలీస్‌స్టేషన్‌ పరిధిలో చోటుచేసుకుంది. అయితే.. ఘ‌ట‌న జ‌రిగి పది రోజులు గడిచినా, ఆధారాలు ఉన్నప్పటికీ నిందితుడిని అరెస్ట్ చేయక పోవడంపై బాధిత అచల తల్లిదండ్రులు, బంధువులు ఆగ్రహాం వ్య‌క్తం చేస్తున్నారు.

వివ‌రాల్లోకి వెళితే.. ఆషికా మేన‌మామ కూతురు అయిన అచ‌ల ఇంజినీరింగ్ గ్రాడ్యూయేష‌న్ పూర్తి చేసి ఉద్యోగంలో చేరేందుకు రెడీగా ఉంది. అదే స‌మ‌యంలో దూర‌పు బంధువు అయినా మ‌యాంక్ (Mayank) తో కొద్ది రోజుల నుంచి స్నేహం చేస్తుంది. అయితే డ్ర‌గ్స్‌కు బాగా అల‌వాటు ప‌డిన మ‌యాంక్ ఆమెను ప్రేమిస్తున్నట్లు నటించి పెళ్లికి ముందే శారీరక సంబంధం పెట్టుకోవాలని ఒత్తిడి చేసేవాడ‌ని స‌మాచారం.

ఇందుకు అచ‌ల‌ అంగీక‌రించ‌క పోవ‌డంతోమ‌యాంక్ ప‌లుమార్లు అచ‌ల‌పై దాడి కూడా చేసి మాన‌సికంగా హింసించాడ‌ని, పదే పదే ఫోన్‌లు చేస్తూనే ఉండేవాడని నిత్యం వేధింపులతో విసిగిపోయి తన కూతురు ఆత్మహత్యకు పాల్పడిందని అచల తల్లి చెప్పింది. ఈ నేప‌థ్యంలో మయాంక్, అతని తల్లి మైనాపై హసన్ సిటీ పోలీస్ స్టేషన్‌లో కేసు నమోదైంది. అచల మృతికి కారణమైన వారిని వెంటనే అరెస్టు చేయాలని ఆమె తల్లిదండ్రులు డిమాండ్ చేస్తున్నారు.

Updated Date - Dec 01 , 2025 | 11:18 AM