Anupama Parameswaran: అందుకే.. ఇప్పుడు కమిట్ అయ్యే చిత్రాల్లో బోల్డ్‌గా నటిస్తున్నా
ABN, Publish Date - Aug 21 , 2025 | 09:53 AM
రీసెంట్‌గా తను నటిస్తోన్న ఓ చిత్రం ఇప్పుడు తన జీవితాన్నే పూర్తిగా మార్చి వేసిందని హీరోయిన్ అనుపమ పరమేశ్వరన్ అన్నారు.
మారి సెల్వరాజ్ దర్శకత్వంలో ధృవ్ విక్రమ్ హీరోగా నటిస్తున్న ‘బైసన్’ చిత్రం తన జీవితాన్ని పూర్తిగా మార్చివేసిందని ఆ చిత్ర హీరోయిన్ అనుపమ పరమేశ్వరన్ (Anupama Parameswaran) అన్నారు. ఈ విషయంపై ఆమె మాట్లాడుతూ.. ‘పరియేరుమ్ పెరుమాళ్’ కోసం దర్శకుడు మారి సెల్వరాజ్ (Mari Selvaraj) మొదట నన్నే సంప్రదించారు. ఆ సమయంలో నేను పలు చిత్రాల్లో నటిస్తూ బిజీగా ఉండటంతో అవకాశాన్ని వదులుకున్నా. మంచి చిత్రంలో నటించలేక పోయాననే బాధ ఇప్పటికీ ఉంది.
ఆ తర్వాత ‘మామన్నన్’లో కూడా ముఖ్య పాత్రకు అవకాశం వచ్చినప్పటికీ నటించలేకపోయా. చివరగా ‘బైసన్’తో నా కల నెరవేరింది. మారి సెల్వరాజ్ కెరీర్‌లోనే మంచి చిత్రంగా ఇది నిలుస్తుంది. ఆయన టేకింగే భిన్నం. ఇప్పటివరకు ఏ ఒక్క చిత్రానికీ శిక్షణ తీసుకున్నది లేదు.
కానీ, ధృవ్ విక్రమ్ (Dhruv Vikram) ‘బైసన్’ కోసం రెండు నెలల పాటు శిక్షణ తీసుకున్నారు. చిత్రీకరణ జరిగే గ్రామానికి వెళ్లి ఆ గ్రామ ప్రజలతో మమేకమైపోయాను. ఈ అనుభవం నా జీవితాన్నే మార్చి వేసింది. ఇప్పుడు కమిట్ అయ్యే అన్ని చిత్రాల్లో బోల్డ్‌గా నటిస్తున్నా. దీనికి కారణం బైసన్ చిత్ర అనుభవమే’ అని అనుపమ పరమేశ్వరన్ వెల్లడించారు.
కాగా అనుపమ తెలుగులో నటించిన కొత్త చిత్రం పరదా మరో రెండు రోజుల్లో థియేటర్లలోకి రానుంది. ఇదిలాఉంటే బైసన్ సినిమా సందర్భంగానే ధృవ్‌తో అనుపమ సన్నిహితంగా మెలిగి, ముద్దులు పెట్టుకున్న ఓ వీడియో ఆ మధ్య నెట్టింట తెగ వైరల్ కావడం విశేషం.