సౌత్ సినిమా+ -

వీడియోలు+ -

వెబ్ స్టోరీస్+ -

వైరల్+ -

Radhika: నటి రాధికకు.. మాతృవియోగం

ABN, Publish Date - Sep 22 , 2025 | 08:25 AM

రాధిక (Radhika), నిరోషల తల్లి గీతా రాధ (86) అనారోగ్యం కారణంగా ఆదివారం రాత్రి తుదిశ్వాస విడిచారు.

Radhika

దివంగత సీనియర్‌ నటుడు ఎం.ఆర్‌.రాధా (Mr Radha) సతీమణి, సీనియర్‌ సినీ నటిమణులు రాధిక (Radhika), నిరోష (Nirosha)ల తల్లి గీతా రాధ (86) (Geetha Radha) అనారోగ్యం కారణంగా ఆదివారం రాత్రి తుదిశ్వాస విడిచారు. తన తల్లి వృద్దాప్యం కారణంగా కన్నుమూసినట్లు రాధిక ఒక ప్రకటనలో వెల్లడించారు.

గీతా రాధ భౌతికకాయాన్ని సినీ ప్రముఖులు, అభిమానుల సందర్శనార్థం ఆళ్వార్‌పేటలోని బిన్నీ రోడ్డు, పోయెస్‌ గార్డెన్‌, మానసర్‌ అపార్టుమెంట్‌లో ఉంచారు. అంత్యక్రియలను సోమవారం సాయంత్రం బీసెంట్‌ నగర్‌లోని విద్యుత్‌ దహనవాటికలో జరుగుతాయని రాధిక వెల్లడించారు.

కాగా, గీతా రాధకు ఇద్దరు కుమార్తెలతో పాటు రాజు, మోహన్‌ అనే ఇద్దరు కుమారులు న్నారు. గీతా రాధ మృతి పట్ల పలువురు సినీ ప్రముఖులు తమ సంతాపాన్ని సానుభూతిని వ్యక్తం చేశారు.

Updated Date - Sep 22 , 2025 | 08:25 AM