సౌత్ సినిమా+ -

వీడియోలు+ -

వెబ్ స్టోరీస్+ -

వైరల్+ -

Vijay Antony: భద్రకాళి.. స్టోరీ మొద‌ట నాకే అర్థం కాలేదు

ABN, Publish Date - Sep 14 , 2025 | 01:31 PM

తాను హీరోగా నటించిన భ‌ద్ర‌కాళి స్టోరీ మొదట అర్థం కాలేదని విజయ్‌ ఆంటోనీ ర్కొన్నారు.

Vijay Antony

తాను హీరోగా నటించిన ‘శక్తి తిరుమగన్‌’ (Shakthi Thirumagan) తెలుగులో భ‌ద్ర‌కాళి (Bhadrakali) స్టోరీ తనకు మొదట అర్థం కాలేదని, దర్శకుడు పలుమార్లు వివరించిన తర్వాత అందులోని సారాంశాన్ని గ్రహించానని హీరో విజయ్‌ ఆంటోనీ (Vijay Antony) పేర్కొన్నారు. విజయ్‌ ఆంటోనీ ఫిల్మ్‌ కార్పొరేషన్‌ పతాకంపై నిర్మించిన ఈ చిత్రానికి దర్శకుడు అరుణ్‌ ప్రభు (Arun Prabu) కాగా తృప్తి (Trupthi Ravindra) హీరోయిన్‌.

ఇటీవల ఓ ఈవెంట్‌లో చిత్రపరిశ్రమకు చెందిన పలువురు సినీ ప్రముఖులు పాల్గొని చిత్ర బృందాన్ని అభినందించి శుభాకాంక్షలు తెలిపారు. వీరిలో నేపథ్యగాయని శోభన చంద్రశేఖర్‌, నిర్మాత ధనుంజయన్‌, నటుడు అజయ్‌ దీషన్‌, నటి రియా, నటి, రిని, దర్శకులు శశి, సుశీంద్రన్‌, మిత్రన్‌ జవహర్‌, ప్రదీప్‌, ఆనంద్‌, ఆండ్రో, ఆనంద్‌ కృష్ణన్‌, జోష్వా, వినాయక్‌, పెప్పిన్‌, నటుడు సెల్‌ మోహన్‌, నటి రాఽధతో పాటు చిత్ర హీరోయిన్‌ తృప్తి, ఇతర నటీనటులున్నారు.

ఈ సందర్భంగా హీరో విజయ్‌ ఆంటోనీ మాట్లాడుతూ ‘ఇప్పటివరకు 19 చిత్రాల్లో హీరోగా నటించాను. కొన్ని చిత్రాల్లో గౌరవ పాత్రల్లో కనిపించాను. ఇది నాకు 25వ చిత్రం. వరుసగా మరికొన్ని చిత్రాల్లో నటించనున్నాను. శశి దర్శకత్వంలో రానున్న ‘నూరు సామి’ (వంద దేవుళ్లు) ఓ మంచి చిత్రంగా ఉంటుంది. నా సొంత బ్యానరులో చిత్రాలు నిర్మిస్తున్నాను. ఇంకా అనేక మందికి అవకాశాలు ఇవ్వనున్నాను. అందుకే మా బ్యానరును పబ్లిక్‌ లిమిటెడ్‌ కంపెనీగా మార్చనున్నాను.

నాకు నటన కంటే దర్శకత్వం, సంగీత దర్శకత్వం వహించడం అంటే ఎంతో ఇష్టం. నేను నిర్మించే చిత్రాల్లో ఇతర హీరోలు నటించకపోవడం వల్లే నేను హీరోగా నటిస్తున్నాను. ‘శక్తి తిరుముగన్‌’ను ‘అరువి’, ‘వాళ్‌’ వంటి చిత్రాలను దర్శకత్వం వహించిన అరుణ్‌ ప్రభు దర్శకత్వం వహించారు. ఈ కథ విన్నాను. రెండో భాగం అర్థం కాలేదు. ఆ తర్వాత మరింత వివరంగా వివరించాక, కథలోని సారాంశాన్ని తెలుసుకున్నాను. అరుణ్‌ ప్రభు దర్శకత్వంలో మరో చిత్రంలో నటించనున్నాను’ అని విజయ్‌ ఆంటోనీ పేర్కొన్నారు.

Updated Date - Sep 14 , 2025 | 01:46 PM