సౌత్ సినిమా+ -

వీడియోలు+ -

వెబ్ స్టోరీస్+ -

వైరల్+ -

Kishan Das: హనీమూన్ వ‌ద్దు.. షూటింగే ముద్దు! షూటింగ్‌ కోసం.. హనీమూన్ వాయిదా వేసుకున్న హీరో

ABN, Publish Date - Nov 14 , 2025 | 03:51 PM

సినిమా షూటింగ్‌ కోసం యువ హీరో కిషన్‌ దాస్ (Kishan Das) తన హనీమూన్‌ షెడ్యూల్‌ మార్చుకున్నారు. ఇప్పుడు ఈ వార్త సోష‌ల్ మీడియాలో వైర‌ల్ అయింది.

Kishan Das

సినిమా షూటింగ్‌ కోసం యువ హీరో కిషన్‌ దాస్ (Kishan Das) తన హనీమూన్‌ షెడ్యూల్‌ మార్చుకున్నారు. ‘ముదలుం నీ ముడివుం నీ’, ‘సింగ్‌’, ’తరుణం’ వంటి చిత్రాల్లో హీరోగా నటించిన కిషన్‌ దాస్‌... తాజాగా ‘ఆరోమలే’ (Aaromaley) అనే ప్రేమ కథా చిత్రంలో కథానాయకుడు.

ఇందులోమ‌న తెలుగ‌మ‌మ్ఆయి శివాత్మిక రాజశేఖర్ (Shivathmika) హీరోయిన్‌. కాగా ఈ చిత్రంలో హీరో పాఠశాల బాలుడు, కాలేజీ విద్యార్థి, ఉద్యోగానికి వెళ్ళే యువకుడిగా మూడు విభిన్న గెట‌పుల్లో కనిపిస్తాడు. మేఘా ఆకాష్‌, నర్మద అతిథి పాత్రల్లో నటించారు. ఇటీవ‌లే థియేట‌ర్ల‌కు వ‌చ్చిన ఈ చిత్రం పాజిటివ్ టాక్‌తో ఫీల్ గుడ్ మూవీగా పేరు తెచ్చుకుని విజ‌యం సాధించింది.

ఇదిలావుంటే, ఈ సినిమా షూటింగ్‌ సమయంలోనే కిషన్‌ దాస్‌కు, సుచిత్ర అనే యువతితో ప్రేమ వివాహం జరిగింది. ఈ పెళ్ళి తర్వాత ఆయన హనీమూన్‌ కోసం ప్లాన్‌ చేసుకున్నారు. అయితే, చిత్రీకరణ ముమ్మరంగా సాగుతుండటంతో తన హనీమూన్‌ వాయిదా వేసుకుని షూటింగ్‌లో పాల్గొన్న విషయాన్ని ఆయన తాజాగా వెల్లడించారు.

Updated Date - Nov 14 , 2025 | 04:07 PM