Actor Dileep: హీరోయిన్ పై అత్యాచారం.. ఎనిమిదేళ్ల తరువాత హీరోకి ఊరట
ABN, Publish Date - Dec 08 , 2025 | 02:23 PM
మలయాళ హీరో దిలీప్ (Dileep) కి ఊరట లభించింది. హీరోయిన్ ను లైంగికంగా వేధించిన కేసులో ఎనిమిదేళ్ల తరువాత కేరళ కోర్టు అతనిని నిర్దోషిగా విడుదల చేసింది.
Actor Dileep: మలయాళ హీరో దిలీప్ (Dileep) కి ఊరట లభించింది. హీరోయిన్ ను లైంగికంగా వేధించిన కేసులో ఎనిమిదేళ్ల తరువాత కేరళ కోర్టు అతనిని నిర్దోషిగా విడుదల చేసింది. దీంతో దిలీప్ కి స్వేచ్ఛ లభించింది. ఇక బయటకు వచ్చిన తరువాత ఆయన చాలా ఎమోషనల్ అయ్యాడు. మీడియా ముందు తనకు న్యాయం చేకూరినట్లు తెలిపాడు. అంతేకాకుండా ఈ కుట్ర వెనుక తన మాజీ భార్య మంజు వారియర్ ఉందని చెప్పుకొచ్చాడు. ఆమెనే ఈ కుట్రను మొదలుపెట్టిందని చెప్పుకొచ్చాడు. తనను నిర్దోషిగా నిరూపించిన లాయర్లకు.. తనకు సపోర్ట్ చేసిన ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు తెలిపాడు. ప్రస్తుతం ఈ వార్త సోషల్ మీడియాను షేక్ చేస్తోంది.
అసలేం జరిగింది.. ఇది ఎప్పుడు మొదలయ్యింది అంటే.. 2017 ఫిబ్రవరిలో ఒక హీరోయిన్ ను.. దిలీప్ ఏర్పాటు చేసిన సునీ గ్యాంగ్ కారులో కిడ్నాప్ చేసి రెండు గంటలు లైంగికంగా వేధించి.. నరకం చూపించారని హీరోయిన్ పోలీసులకు ఫిర్యాదు చేసింది. దీని వెనుక దిలీప్ ఉన్నాడని, అతడు తనపై పగతోనే ఇదంతా చేసినట్లు ఆమె ఆరోపించింది. అప్పటి నుంచి ఈ కేసు కోర్టులో నడుస్తూనే ఉంది.ఇక దిలీప్ కు వ్యతిరేకంగా అతని మాజీ భార్య మంజు వారియర్ కూడా నిలబడడంతో కేసు మరింత స్ట్రాంగ్ అయ్యింది. సునీతతో పాటు మరో ఐదుగురు ఈ ఘాతుకానికి ప్ పాల్పడినట్లు ఆధారాలు ఉండడంతో వారినే కోర్టు దోషులుగా పరిగణించింది.
ఎనిమిదేళ్లగా దిలీప్ అత్యాచార నిందితుడు అనే ముద్రతోనే బతుకుతున్నాడు. అతను ఏ ఈవెంట్ కి వెళ్లినా ఈ ఫ్రాడ్ ఇక్కడకు ఎందుకు వచ్చాడు అంటూ ట్రోల్ చేసిన వారు కూడా ఉన్నారు. ఎన్నోసార్లు జైలుకు వెళ్లి.. బెయిల్ మీద బయటకు వచ్చాడు దిలీప్. ఇంత జరిగినా సినిమాలు వదలకుండా మంచి మంచి కథలతో సినిమాలు తెరకెక్కించి రిలీజ్ చేసి హిట్స్ అందుకున్నాడు. దాదాపు ఎనిమిదేళ్ల పోరాటం తరువాత అతనిపై ఆ ముద్ర చెరిగింది. అతనే నిందితుడు అనే అధరాలు లేకపోవడంతో దిలీప్ ని కోర్టు వదిలేసింది. అతనితో పాటు మరో ముగ్గురిని కూడా నిర్దోషులు అని తేల్చి చెప్పింది. ఇక హీరోయిన్ ని కిడ్నాప్ చేసిన పల్సర్ సునీ గ్యాంగ్ ని నిందితులుగా నిర్థారించిన కేరళ కోర్టు డిసెంబర్ 12 న వారికి ఎలాంటి శిక్ష పడనుందో చెప్పనుంది.