Gandhi Kannadi: ఈ సినిమాను.. 50 మంది హీరోయిన్లు నిరాకరించారు
ABN, Publish Date - Aug 31 , 2025 | 04:09 PM
కథ నచ్చినప్పటికీ తనతో నటించేందుకు 50 మంది హీరోయిన్లు నిరాకరించారని నటుడు కేపీవై బాలా అన్నారు.
కథ నచ్చినప్పటికీ తనతో నటించేందుకు 50 మంది హీరోయిన్లు నిరాకరించారని నటుడు కేపీవై బాలా (Balaji Sakthivel) అన్నారు. ఆయన హీరోగా రూపొందిన చిత్రం ‘గాంధీ కన్నాడి’ (Gandhi Kannadi). ఈ చిత్ర వివరాలను చెన్నైలో జరిగిన విలేకరుల సమావేశంలో వెల్లడించారు.
ఇందులో కేపీవై బాలా మాట్లాడుతూ.. ‘ఈ సినిమా కోసం హీరోయిన్ల ఎంపిక ఓ ప్రహసనంలా సాగింది. హాలులో కథను శ్రద్ధగా విన్న హీరోయిన్లు, ఆ తర్వాత హీరో ఎవరు అని అడుగుతారు. దర్శకుడు నా పేరు చెప్పగానే మళ్లీ చెపుతామంటూ వెళ్లిపోతారు. అలా 50 మంది హీరోయిన్లు ఈ కథ విని నేను హీరో అని తెలియగానే నాతో నటించేందుకు నిరాకరించారు.
51వ హీరోయిన్‌గా నమిత కృష్ణమూర్తి (Namita Krishnamurthy) ఎంపికయ్యారు. కథ వినగానే ఎలాంటి మరో ఆలోచన లేకుండా సమ్మతించారు’ అని పేర్కొన్నారు. కాగా, సింగిల్ షెడ్యూల్‌లో చిత్రీకరణ పనులను పూర్తి చేయగా, సెప్టెంబరు 5న విడుదల చేయనున్నారు.
ఆదిమూలం క్రియేషన్స్ పతాకంపై నిర్మాత జయకిరణ్ నిర్మించారు. ‘రణం’ ఫేం షెరీఫ్ దర్శకుడు. ఇందులో దర్శకుడు బాలాజీ శక్తివేల్, అర్చన (Archana) తదితరులు ముఖ్య పాత్రలను పోషించారు. వివేక్ - మెర్విన్ ద్వయం సంగీతం సమకూర్చింది.