ACE: విజయ్ సేతుపతి ఆధ్వర్యంలో ప్రీ రిలీజ్ ఫంక్షన్

ABN, Publish Date - May 22 , 2025 | 05:04 PM

విజయ్ సేతుపతి హీరోగా నటించిన 'ఏస్' సినిమా తమిళంతో పాటు తెలుగులోనూ శుక్రవారం జనం ముందుకు వస్తోంది. ఇందులో కన్నడ భామ రుక్మిణీ వసంత్ హీరోయిన్ గా నటించింది.

వెర్సటైల్ యాక్టర్ మక్కల్ సెల్వన్ విజయ్ సేతుపతి (Vijay Sethupathi) నటించిన 'మహరాజా' (Maharaja) చిత్రం చక్కని విజయాన్ని తెలుగులోనూ అందుకోవడంతో సహజంగానే ఆయన తదుపరి చిత్రాలపై క్రేజ్ ఏర్పడింది. ఈ నేపథ్యంలో 23న రాబోతున్న సినిమా 'ఏస్' (Ace). తమిళంతో పాటు తెలుగులోనూ ఒకేసారి ఈ సినిమా జనం ముందుకు వస్తోంది. ఈ సినిమాను ఆర్ముగ కుమార్ (Arumuga Kumar) స్వీయ దర్శకత్వంలో నిర్మించారు. రుక్మిణీ వసంత్ (Rukmini Vasanth) హీరోయిన్ గా నటించింది. ఈ సినిమాను బి. శివప్రసాద్ తెలుగువారి ముందుకు తీసుకొస్తున్నారు. ఈ సందర్భంగా హైదరాబాద్ లో జరిగిన ప్రీ-రిలీజ్ ఈవెంట్ లో విజయ్ సేతుపతి, దర్శక నిర్మాత ఆర్ముగ కుమార్, నటి దివ్యా పిళ్ళై (Divya Pillai), బబ్లూ పృథ్వీ తదితరులు పాల్గొన్నారు.


ఈ సందర్భంగా తెలుగు నిర్మాత శివకుమార్ మాట్లాడుతూ, 'ఇప్పటికే తమ చిత్రం బ్లాక్ బస్టర్ హిట్ అయినట్టు అనిపిస్తోందని, ఈ కథ, అందులోని క్యారెక్టర్స్ అద్భుతంగా ఉండబోతున్నాయ'ని అన్నారు. అన్ని అనుకున్నట్టు జరిగితే త్వరలోనే విజయ్ సేతుపతితో 'రొమాంటిక్ డాన్' అనే మూవీని తాను నిర్మిస్తానని చెప్పారు. విజయ్ సేతుపతి మాట్లాడుతూ, 'ఆర్ముగం కుమార్ నాకు చాలా కాలంగా తెలుసు. నాకు సినిమాల్లో మొదటి ఛాన్స్ ఇచ్చింది కూడా ఆయనే. మళ్ళీ ఇప్పుడు ఆయనతో పనిచేయడం ఆనందంగా ఉంది. యాక్షన్, రొమాన్స్ అన్నీ సమపాళ్ళలో ఉన్న సినిమా ఇది. తెలుగు డబ్బింగ్ బాగా వచ్చింది. మీరంతా చూసి ఈ సినిమాను సక్సెస్ చేయాలని కోరుకుంటున్నాను' అని అన్నారు.

Also Read: Raja Shivaji: జెనీలియా నిర్మాత‌గా రాజా శివాజీ... హీరో కమ్ డైరెక్టర్ గా రితేశ్

Also Read: Peddi: పెద్ది మ‌రో అప్టేట్‌.. భారీ యాక్ష‌న్ సీన్ల చిత్రీక‌ర‌ణ‌

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి 

Updated Date - May 22 , 2025 | 05:04 PM