Abbas: దశాబ్దం తర్వాత అబ్బాస్ రీఎంట్రీ
ABN , Publish Date - Jul 24 , 2025 | 10:35 AM
పలు కారణాల వల్ల సినిమాలకు దూరమైన పాపులర్ హీరో అబ్బాస్ (Abbas) పదేళ్ళ తర్వాత కోలీవుడ్‌లోకి రీఎంట్రీ ఇస్తున్నారు.
పలు కారణాల వల్ల సినిమాలకు దూరమైన పాపులర్ హీరో అబ్బాస్ (Abbas) పదేళ్ళ తర్వాత కోలీవుడ్‌లోకి రీఎంట్రీ ఇస్తున్నారు. ప్రముఖ సంగీత దర్శకుడు జీవీ ప్రకాష్ కుమార్ (GV prakash) హీరోగా నటించే కొత్త చిత్రంలో అబ్బాస్ కీలక పాత్ర పోషిస్తున్నారు. ఇంకా టైటిల్ ఖరారు చేయని ఈ చిత్రం షూటింగ్ సంప్రదాయ పూజా కార్యక్రమంతో ప్రారంభమైంది. దర్శకుడు ప్రదీప్ రంగనాథన్ వద్ద అసిస్టెంట్‌గా పనిచేసిన మరియ రాజా ఈ చిత్రం ద్వారా దర్శకుడిగా పరిచయమవుతున్నారు.
బియాండ్ పిక్చర్స్ పతాకంపై జయవర్థనన్ నిర్మిస్తున్నారు. శ్రీ గౌరి ప్రియ హీరోయిన్. హాస్యం, కుటుంబ కథా చిత్రంగా తెరకెక్కిస్తున్నామని, 1990 - 2000 మధ్యకాలంలో పాపులర్‌గా హీరోగా గుర్తింపు పొందిన అబ్బాస్ ఈ చిత్రంలో ముఖ్య పాత్రను పోషిస్తున్నారని దర్శకనిర్మాతలు వెల్లడించారు.
పలు కారణాల వల్ల సినిమాలకు దూరమైన అబ్బాస్ ఒకప్పుడు అమ్మాయిలకు కలల రాకుమారుడుడు. అతని గ్లామర్ కి అమ్మాయిలు ఫిదా ఐపోయేవారు. ఫ్యాన్ ఫాలోయింగ్ కూడా ఎక్కువే. 2015లో మలయాళం 'పచ్చ కల్లం' సినిమా చేసిన తర్వాత అయన పదేళ్లు గ్యాప్ తీసుకున్నారు. ఇప్పుడు రీ ఎంట్రీతో మల్లి తన సత్తా చాటడానికి సిద్ధం అవుతున్నారు.
ALSO READ:
Pawan Kalyan: అవి బావిలో కప్పలు.. ట్రోలర్స్ కు పవన్ గట్టి కౌంటర్
Rana Daggubati: రానాకు మళ్లీ ఈడీ నోటీసులు