Vijay Deverakonda, Rashmika: హ్యపీ బర్త్ డే ‘విజ్జు’.. మరోసారి దొరికిపోయిన రష్మిక
ABN , Publish Date - May 09 , 2025 | 09:45 PM
విజయ్ దేవరకొండ (Vijay Deverakonda) ఈ రోజు ( మే 9) న పుట్టిన రోజు జరుపుకుంటున్న సంగతి అందరికీ తెలిసిందే.
విజయ్ దేవరకొండ (Vijay Deverakonda) ఈ రోజు ( మే 9) న పుట్టిన రోజు జరుపుకుంటున్న సంగతి అందరికీ తెలిసిందే. ఈనేపథ్యంలో ఇప్పటికే దిల్ రాజు, మైత్రీ మూవీ మేకర్స్ సినిమాల నుంచి ఫస్ట్ లుక్‌లు కూడా రిలీజ్ చేసి అభిమానులను తృప్తి పరిచారు. అంతేగాక చాలామంది సెలబ్రిటీలు, ఫ్యాన్స్ విజయ్‌కు జన్మదిన శుభాకాంక్షలు తెలుపుతున్నారు.
అయితే ఉదయం నుంచి చాలామంది ఎదురు చూస్తున్న ఇకరి విషెష్ ఎట్టకేలకు వచ్చాయి. లాంగ్‌టైం స్నేహితురాలు, రూమర్డ్ గర్ల్‌ఫ్రెండ్ రష్మిక మందన్నా (Rashmika Mandanna) అందరి కంటే ఆలస్యంగా విజయ్‌కు బర్త్‌డే గ్రీటింగ్స్ తెలిపింది.
ఈ మేరకు తన ఇన్ స్టా స్టోరీలో విజయ్ ఫొటో షేర్ చేస్తూ హ్యపియస్ట్ బర్త్ డే విజ్జు అంటూ వ్రాసుకొచ్చింది. లవ్ సింబల్స్, ప్లవర్స్ సింబల్స్ పెట్టింది. ఇప్ప కామెంట్ పెట్టి వారిమధ్య ఉన్న బాండింగ్‌ను మరోసారి బయటకు చూయించారు. ఇప్పుడు ఈ పోస్టు సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతుంది.