సంక్రాంతి కానుకగా జనవరి 12న 'డాకు మహారాజ్' చిత్రం ప్రపంచ వ్యాప్తంగా భారీస్థాయిలో విడుదల కానుంది. విడుదల తేదీ దగ్గర పడుతుండటంతో ప్రచార కార్యక్రమాలలో మరింత జోరును పెంచింది చిత్ర బృందం. ఈ క్రమంలో తాజాగా మీడియాతో ముచ్చటించిన కథానాయిక ప్రగ్యా జైస్వాల్, సినిమాకి సంబంధించిన పలు ఆసక్తికర విషయాలను పంచుకున్నారు.