The Hunter: ఓటీటీలో.. అదిరిపోయే సీట్ ఎడ్జ్ థ్రిల్లర్
ABN, Publish Date - Dec 04 , 2025 | 09:33 PM
కొదండరామిరెడ్డి తనయుడు వైభవ్ రెడ్డి హీరోగా గత సంవత్సరం తమిళంలో రూపొందిన మిస్టరీ థ్రిల్లర్ చిత్రం రణం. ఇప్పుడీ సినిమాను ‘ది హంటర్ చాప్టర్ 1’ పేరుతో తెలుగులో డిజిటల్ స్ట్రీమింగ్‌కు తీసుకువచ్చారు.
ప్రముఖ దర్శకుడు కొదండరాముడు తనయుడు వైభవ్ రెడ్డి (Vaibhav) హీరోగా గత సంవత్సరం తమిళంలో రూపొందిన మిస్టరీ థ్రిల్లర్ చిత్రం రణం (Ranam Aram Thavarel). ఇప్పుడీ సినిమాను ‘ది హంటర్ చాప్టర్ 1’ (The Hunter: Chapter-1)పేరుతో తెలుగులో అనువాదం చేసి డిజిటల్ స్ట్రీమింగ్‌కు తీసుకువచ్చారు. నందితా శ్వేత (Nandita Swetha), తాన్యా హోప్ (Tanya Hope) కీలక పాత్రల్లో నటించగా షెరీఫ్ (Sherief ) రచన, దర్శకత్వం చేశాడు.
కథ విషయానికి వస్తే.. ఫేషియల్ రీకన్‌స్ట్రక్షన్ ఆర్టిస్ట్‌గా శివకు మంచి పేరు ఉంటుంది. గుర్తుపట్టలేని స్థితిలో ఉన్న ఒక మృతదేహానికి ఫేస్ స్కెచ్ తయారు చేసి ఇవ్వడంతో ఆ ప్రమాదాల వెనుక ఉన్న కథనాలు కూడా వ్రాసి ఇస్తూ పోలీసులకు సాయం చేస్తుంటాడు.అయితే.. ఓ రోజు జరిగిన ప్రమాదంలో తన భార్యను కోల్పోయిన శివ తీవ్రంగా గాయపడి తన జ్ఞాపకాలను గుర్తు చేసుకునేందుకు విఫల ప్రయత్నాలు చేస్తూ తనదైన లోకంలో మాత్రమే నివసిస్తూ ఉంటాడు.
సరిగ్గా అదే సమయంలో ఓ పోలీస్ స్టేషన్‌కు సమీపంలో బాడీ పార్ట్స్ అన్నా వేర్వేరుగా బాక్సుల్లో వేర్వేరు ప్రాంతాల్లో బయటపడుతాయి. అంతేగాక కొద్ది రోజులకు పోలీసాఫీసర్ సైతం అదృశ్యం అవుతాడు. దీంతో కేసును పరిశోధించేందుకు రంగంలోకి దిగిన శికు ఎలాంటి పరిస్థితులు ఎదురయ్యాయి, అంతుబట్టని ఆ కేసులను చేధించాడా లేదా అనేది కథ.
సినిమా కాస్త నిదానంగా.. స్టార్ట్ అయిన ఓ 20 నిమిషాల తర్వాతి నుంచి పుంజుకుని చివరి వరకు ట్విస్టులు, సీట్ ఎడ్జింగ్ థ్రిల్లింగ్ సన్నివేశాలతో ఆకట్టుకుంటుంది. ఇప్పుడీ సినిమా ఆహా (Aha) ఓటీటీ (OTT)లో స్ట్రీమింగ్ అవుతోంది. మంచి ఇన్వెస్టిగేషన్, మిస్టరీ థ్రిల్లర్ సినిమాలు ఇష్ట పడేవారికి ఈ చిత్రం మంచి ఫుల్ మీల్స్ లా ఉంటుంది. థియేటర్లలో మిస్సయిన వారు, థ్రిల్లర్లు ఇష్టపడే వారు మస్ట్‌గా చూడాల్సిన సినిమా ఇది.