OTT: లేటెస్ట్.. తెలుగు క్రైమ్, ఇన్వేస్టిగేషన్ థ్రిల్లర్ రెండు ఓటీటీల్లోకి వచ్చేసింది
ABN, Publish Date - Oct 10 , 2025 | 07:01 AM
పురాణ పాత్ర బార్బరికుడి మూడు అద్భుత బాణాల కథను ఆధారంగా చేసుకుని, దర్శకుడు మోహన్ శ్రీవత్స తెరకెక్కించిన క్రైమ్ ఇన్వెస్టిగేషన్ థ్రిల్లర్ త్రిబాణధారి బార్బరిక్
మహాభారత పురాణ పాత్ర బార్బరికుడి మూడు అద్భుత బాణాల కథను ఆధారంగా చేసుకుని, దర్శకుడు మోహన్ శ్రీవత్స తెరకెక్కించిన క్రైమ్ ఇన్వెస్టిగేషన్ థ్రిల్లర్ త్రిబాణధారి బార్బరిక్ (Tribanadhari Barbarik). అగస్టు 8, 2025న థియేటర్లలో విడుదలైన ఈ చిత్రం, ప్రేక్షకుల నుంచి మిశ్రమ స్పందన తెచ్చుకున్నప్పటికీ థియేటర్లలో వచ్చి చూడడానికి చాలామంది ఆసక్తి చూపలేదు. దీంతో ఈ చిత్ర దర్శకుడు తన చెప్పుతో తనను తానే కొట్టుకున్న విషయం బాగా వైరల్ అయిన విషయం తెలిసిందే. ఇప్పుడు ఈ సినిమా డిజిటల్ స్ట్రీమింగ్‌కు వచ్చేసింది.
ఘటోత్కచుని కుమారుడైన బార్బరికుడికి దేవతలు మూడు బాణాలు ప్రసాదిస్తారు. అవి ఒక్కొక్కటి విశేష శక్తి కలిగినవి. ఒక్క బాణంతో శత్రువులను గుర్తించడం, మరో దానితో వారిని బంధించడం, మూడవది వారిని నాశనం చేస్తుంది. సరిగ్గా ఈ కాన్సెప్టును మాత్రమే దర్శకుడు తీసుకుని ఓ కిడ్నాప్ అయిన మనుమరాలిని వెతికే క్రమంలో ఓ తాత చేసిన ఇన్వెస్టేగేషన్ చూట్టూ ఈ చిత్రం సాగుతుంది. మరో వైపు డబ్బు కోసం ఇద్దరు చేసిన పనులు వాళ్ల ప్రాణం మీదకు ఎలా వచ్చింది, వారికి ఆ కిడ్నప్ అయున అమ్మాయికి మధ్యలింక్ ఏంటి అనేదే స్టోరి.
కథ మొదటి అర్ధంలో ఫాస్ట్-పేస్డ్ ఇన్వెస్టిగేషన్‌తో సాగుతూ ఆకట్టుకుంటుంది. రెండో భాగంలో ఎమోషనల్ టర్న్ తీసుకుంటుంది.అంతేగాక సినిమా కొంచెం నెమ్మదిస్తూ, అక్కడక్కడే తిరుగుతున్నట్టు అనిపిస్తుంది. అయితే చివర్లో వచ్చే క్లైమాక్స్ ట్విస్ట్, బార్బరికుడి లింక్‌ను ఎమోషనల్‌గా చూపించడం ఆసక్తికరంగా ఉంటుంది. మన చుట్టూ రాముడి వేషంలో రావణులు దాగి ఉంటారు అనే సందేశం కూడా ఇస్తుంది. థ్రిల్లర్, సస్పెన్స్ కథల్ని ఇష్టపడేవారు ఒకమారు చూడొచ్చు. ఇప్పుడీ సినిమా అమెజాన్ ప్రైమ్ వీడియో (PrimeVideo), సన్ నెక్ట్స్ (Sun NXT) ఓటీటీల్లో (OTT) తెలుగుతో పాటు తమిళంలో స్ట్రీమింగ్ అవుతుంది.