Mission Impossible The Final Reckoning: మూడు నెలల తర్వాత.. ఓటీటీకి వచ్చిన రీసెంట్ హాలీవుడ్ బ్లాక్‌బస్టర్
ABN, Publish Date - Aug 18 , 2025 | 10:26 AM
ప్రపంచవ్యాప్తంగా కోట్లాది మంది ఎదురు చూస్తున్న హాలీవుడ్ చిత్రం ‘మిషన్ ఇంపాజిబుల్: ది ఫైనల్ రెకనింగ్’ ఎట్టకేలకు డిజిటల్ స్ట్రీమింగ్‌కు వచ్చేసింది.
ప్రపంచవ్యాప్తంగా కోట్లాది మంది ఎదురు చూస్తున్న హాలీవుడ్ బ్లాక్‌బస్టర్ హిట్ చిత్రం ‘మిషన్ ఇంపాజిబుల్: ది ఫైనల్ రెకనింగ్’ (Mission Impossible The Final Reckoning) ఎట్టకేలకు సుమారు మూడు నెలల తర్వాత డిజిటల్ స్ట్రీమింగ్‌కు (OTT) వచ్చేసింది. మే 17న థియేటర్లలోకి వచ్చిన ఈ సినిమా దాదాపు 600 మిలియన్ డాలర్లకు (అక్షరాలా 5,250 కోట్లు) పైగా వసూళ్లు సాధించి బాక్సాఫీస్ వద్ద నూతన రికార్డులను క్రియేట్ చేసింది. పైగా సినిమా వచ్చి మూడు మాసాలు పూర్తి కావస్తున్నా ఇంకా చాలా దేశాలలో స్టిల్ ఇప్పటికీ విజయవంతంగా ప్రదర్శితమవుతూ సంచలనాలు క్రియేట్ చేస్తోంది.
హాలీవుడ్ సినిమా ఫ్రాంచైజీల్లో ‘మిషన్ ఇంపాజిబుల్’కు ఉన్న క్రేజ్ గురించి ప్రత్యేకించి చెప్పక్కర్లేదు. . ఆ సిరీస్‌లో 8వ, చివరి సినిమాగా ప్రచారంతో ‘మిషన్ ఇంపాజిబుల్: ది ఫైనల్ రెకనింగ్’ తెరకెక్కింది. స్పై యాక్షన్ థ్రిల్లర్ నేపథ్యంలో వచ్చిన ఈ చిత్రంలో టామ్ క్రూజ్ (Tom Cruise) మరోసారి ఏజెంట్ ఇథెన్ క్యారెక్టర్‌లో తన మార్కు యాక్షన్‌తో దుమ్ము లేపాడు. రెండేండ్ల క్రితం వచ్చిన ఈ సినిమా ఫస్ట్ పార్ట్‌లో ముగింపు తర్వాతి నుంచి ఈ సినిమా ప్రారంభం అవుతుంది. ప్రపంచాన్ని శాసించడానికి ప్రయత్నిస్తోన్న ఎంటిటీ అనే ఏఐని తమ అధీనంలోకి తెచ్చుకోవాలని అనేక మంది ప్రయత్నిస్తుంటారు. అందుకు సంబంధించిన ఏఐ కీ వారేవరికీ దొరకకుండా చూస్తుంటాడు ఇథెన్.
అయితే సముద్రగర్బంలో ఓ రహాస్య ప్రాంతంలో మునిగిపోయిన సెవాస్ట్‌పోల్ సబ్‌మెరైన్‌లో ఉన్న ఎంటీటీ ఒరిజినల్ సోర్స్ కోడ్‌ను నాశనం చేస్తే ప్రపంచాన్ని కాపాడొచ్చని తెలుసుకున్న ఇథెన్ అందుకోసం సముద్ర గర్బంలోకి వెళ్లడానికి సిద్దమవుతాడు. ఈ నేపథ్యంలో ఇథెన్ అనుకున్నది సాధించగలిగాడా లేదా, ఎలాంటి పరిణామాలు ఎదురయ్యాయి, కంటికి కపిపించని శత్రువును ఎలా ఎదుర్కొన్నాడనే ఆసక్తికరమైన థ్రిల్లింగ్ పాయింట్లతో సినిమా సాగుతుంది. ముఖ్యంగా సముద్రంలో ఇథెన్ సాహాసాలు చూసే వారిని సీట్ ఎడ్జ్‌లో కూర్చో బెట్టడమే గాక తర్వాత ఏం జరుగబోతుందనే క్యూరియాసిటీని పెంచుతాయి.
ఆ విజువల్స్ సైతం వావ్ అనిపిస్తాయి. దాదాపు అర గంట పాటు ఉండే ఫ్లైట్ పోరాట సన్నివేశాలు అబ్బుర పరుస్తాయి. టామ్ క్రూజ్ ఈ వయసులోనూ ఆ సీన్లు ఎటాంటి డూప్ లేకుండా ప్రాణాలకు తెగించి చేశాడంటే అతని చిత్తశుద్దికి నమస్కరించకుండా ఉండలేం. అదిరిపోయే యాక్షన్, కళ్లు చెదిరే విజువల్స్ సినిమాలు ఇష్ట పడే వారికి ఈ చిత్రం బెస్ట్ ఛాయిస్. అల్రేడీ చూసిన వారు, ఇప్పటివరకు చూడని వారు అసలు వదలుకుండా చూసేయవచ్చు. ఇప్పుడీ (Mission Impossible The Final Reckoning) సినిమా అమెజాన్ ప్రైమ్ వీడియో (Amazon Prime Video)లో రెంట్ పద్దతిలో స్ట్రీమింగ్‌కు వచ్చేసింది.