సౌత్ సినిమా+ -

వీడియోలు+ -

వెబ్ స్టోరీస్+ -

వైరల్+ -

The Great Pre Wedding Show OTT: ఫొటో షూట్ డాటా పోతే.. లేటెస్ట్‌ కామెడీ డ్రామా ఓటీటీకి వ‌చ్చేసింది

ABN, Publish Date - Dec 05 , 2025 | 08:03 AM

గ‌త నెల‌లో అనామ‌కంగా ప్రేక్ష‌కుల ఎదుట‌కు సైలెంట్‌గా వ‌చ్చి పాజిటివ్ టాక్‌తో సూప‌ర్ హిట్‌గా నిలిచిన చిత్రం ది గ్రేట్ ప్రీ వెడ్డింగ్ షో ఓటీటీకి వ‌చ్చేసింది.

The Great Pre Wedding Show

గ‌త నెల‌లో అనామ‌కంగా ప్రేక్ష‌కుల ఎదుట‌కు సైలెంట్‌గా వ‌చ్చి పాజిటివ్ టాక్‌తో సూప‌ర్ హిట్‌గా నిలిచిన చిత్రం ది గ్రేట్ ప్రీ వెడ్డింగ్ షో (The Great Pre-Wedding Show). మ‌సూద ఫేం తిరువీర్ (Thriuveer) హీరోగా న‌టించ‌గా టినా శ్రావ్య (Teena sravya) జంటగా క‌థానాయిక‌గా న‌రేంద్ర రవి (Narendra Ravi), రోహన్‌రాయ్, యామిని నాగేశ్వర్ ప్ర‌ధాన‌ పాత్రలు చేశారు. ఇప్పుడీ చిత్రం ఓటీటీ ప్రేక్ష‌కుల‌ను సైతం అల‌రించేందుకు డిజిట‌ల్ స్ట్రీమింగ్‌కు వ‌చ్చేసింది.

కథ ఏంటంటే: ఉత్త‌రాంధ్ర‌లోని ఓ మారుమూల ప‌ల్లెలో ఫొటో స్టూడియో, జీరాక్స్ సెంట‌ర్ న‌డిపిస్తుంటాడు ర‌మేశ్‌. అక్క‌డే గ్రామ పంచాయ‌తీ సెక్ర‌ట‌రీగా ప‌ని చేస్తున్న హేమ‌ను ప్రేమిస్తాడు. అయితే.. అనుకోకుండా ఆనంద్ అనే ఓ మోస్త‌రు చోటా మోటా లీడ‌ర్‌కు సౌంద‌ర్య ల‌నే అమ్మాయితో పెళ్లి కుద‌ర‌గా ఫ్రీ వెడ్డింగ్ షూట్ ఆర్డ‌ర్ ర‌మేశ్‌కు ఇస్తాడు. అయితే షూట్ పూర్తి చేసిన ర‌మేశ్ ఆ డాటా అంతా ఓ పెన్ డ్రైవ్‌లో పెట్టి జాగ్ర‌త్త చేస్తున్న స‌మ‌యంలో అది కాస్త మిస్ అవుతుంది. దీంతో ఈ విష‌యం ఆనంద్‌కు తెలిస్తే ఏమైనా చేస్తాడ‌ని భావించి వారి పెళ్లిని చెడ‌గొట్టాల‌నే ఫ్లాన్ చేసి విజ‌యం సాధిస్తాడు. ఈ నేప‌థ్యంలో ర‌మేశ్ ఎలాంటి ప‌ర్య‌వ‌సానాలు ఎదుర్రొన్నాడు, తిరిగి అత‌నే మ‌ళ్లీ పెళ్లి చేసేందుకు ఎన్ని తిప్ప‌లు ప‌డాల్సి వ‌చ్చింద‌నేది స్టోరి.

ఓ సింపుల్ లైన్‌తో ఆద్యంతం న‌వ్వులు పంచ‌డ‌మే ప‌ర‌మావ‌ధిగా తెర‌కెక్కిన ఈ చిత్రం ప్రేక్ష‌కులు ప్ర‌తి ఒక్క‌రికి ఆరోగ్య‌క‌ర‌మైన వినోదాన్ని అందిస్తుంది. ఎక్క‌డా అస‌భ్య‌త లేకుండా మాట‌ల నుంచే సిట్యువేష‌న్ కామెడీ జ‌న‌రేట్ అయి వీక్ష‌కుల‌ను క‌డుపుబ్బా న‌వ్విస్తుంది. సినిమాలో వంక పెట్ట‌డానికి ఏమీ ఉండ‌దు. కుటుంబం అంతా క‌లిసి సినిమాను ఆస్వాదించ‌వ‌చ్చు. ఇప్పుడీ ది గ్రేట్ ప్రీ వెడ్డింగ్ షో (The Great Pre-Wedding Show) చిత్రం జీ5 (Zee 5) ఓటీటీ (OTT) లో తెలుగుతో పాటు ఇత‌ర భాష‌ల్లోనూ అందుబాటులో ఉంది. థియేట‌ర్‌లో మిస్స‌యిన వారు, మంచి కామెడీ, టైంఫాస్ కావాల‌నుకునే వారు త‌ప్ప‌క చూడాల్సిన సినిమా ఇది. డోంట్ మిస్‌.

Updated Date - Dec 05 , 2025 | 12:59 PM