Squid Game3: ఈ సారి ఆట మాములుగా ఉండదు.. అంతకుమించి! స్క్విడ్ గేమ్3 తెలుగు ట్రైలర్
ABN , Publish Date - Jun 01 , 2025 | 02:19 PM
ప్రపంచవ్యాప్తంగా చాలామంది అభిమానులు ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్న వెబ్ సిరీస్ స్క్విడ్ గేమ్3 తెలుగుట్రైలర్ వచ్చేసింది.
ప్రపంచవ్యాప్తంగా చాలామంది అభిమానులు ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్న వెబ్ సిరీస్ స్క్విడ్ గేమ్ (Squid Game). ఇప్పటికే రెండు సీజన్‌లుగా వచ్చిన ఈ సిరీస్ ఒకదాన్ని మించి మరోటి దిగ్విజయం సాధించి వీక్షకులకు ఎనలేని థ్రిల్‌ను పంచాయి. ఈ క్రమంలో ఫైనల్ సీజన్3 స్ట్రీమింగ్‌కు రెడీ అయింది. ఈ నేపథ్యంలో తాజాగా ఫైనల్ సీజన్ ట్రైలర్ విడుదల చేశారు. జూన్ 27న డిజిటల్ స్ట్రీమింగ్‌కు రానుంది.
మొదటి సీజన్‌లో.. స్క్విడ్ గేమ్ (Squid Game) గెలిచిన 456 నంబర్ ప్లేయర్ తిరిగి ఆ గేమ్ మళ్లీ ప్రారంభిస్తున్నట్లు తెలుసుకుంటాడు. అక్కడ జరుగుతున్న దురాగతాన్ని ప్రపంచానికి తెలియజేయాలని తిరిగి గేమ్‌లోకి ఎంట్రీ ఇచ్చి అక్కడ కొంతమందితో కలిసి ఎదురు తిరుగుతారు. కానీ పట్టుబడి మళ్లీ గేమ్ ఆడాల్సిన పరిస్థితితో రెండో సీజన్ ముగించారు. దీంతో ఇప్పుడు మూడో సీజన్‌పై అంచనాలు మరింతగా పెరిగాయి.
ఈ క్రమంలో శనివారం ఈ సీజన్ ట్రైలర్ రిలీజ్ చేశారు. తిరిగి పట్టుబడ్డ హీరో అక్కడి నుంచి బయట పడ్డాడా, వారితో ఏవిధంగా పోరాడాడు, పోలీసులు ఆ గేమ్ జరిగే ప్రాంతాన్ని కనుగొనగలిగారా లేదా అనే ఆసక్తికరమైన కథకథనాలతో సాగుతూ అంతకుమించి అనే గేమ్ సీక్వెన్సులతో ఈ ఫైనల్ సీజన్ సాగనున్నట్లు ఈ ట్రైలర్ చూస్తే తెలుస్తుంది. జూన్ 27న నెట్‌ఫ్లిక్స్ (Netflix) లో స్ట్రీమింగ్ అవనుంది.