The Hunt OTT: రాజీవ్ హ‌త్య వెనుక‌.. ఏం జ‌రిగింది! ఓటీటీకి.. వ‌చ్చేస్తోన్న వెబ్ సిరీస్‌

ABN , Publish Date - Jul 02 , 2025 | 10:12 AM

చాలాకాలం త‌ర్వాత ఓ బ‌యోపిక్ లాంటి వెబ్ సిరీస్ డిజిట‌ల్ స్ట్రీమింగ్‌కు వ‌చ్చేస్తుంది.

the hunt

చాలాకాలం త‌ర్వాత ఓ బ‌యోపిక్ లాంటి వెబ్ సిరీస్ డిజిట‌ల్ స్ట్రీమింగ్‌కు వ‌చ్చేస్తుంది. భార‌త మాజీ ప్ర‌దాన‌మంత్రి రాజీవ్ గాంధీ హత్య నేప‌థంయ‌లో అనిరుధ్య మిత్ర ర‌చించిన బెస్ట్ సెల్లింగ్ బుక్‌ ‘నైన్టీ డేస్’ ఆధారంగా ‘ది హంట్: ది రాజీవ్ గాంధీ అస్సాసినేషన్ కేస్’(The Hunt - The Rajiv Gandhi Assassination Case) ను తెర‌కెక్కించారు. జాతీయ అవార్డు గ్రహీత నాగేష్ కుకునూర్ (Nagesh Kukunoor) ద‌ర్శ‌క‌త్వం వ‌హించాడు. సాహిల్ వైద్ (Sahil Vaid), భగవతి పెరుమాళ్ (Bagavathi Perumal), డానిష్ ఇక్బాల్ (Danish Iqbal) గిరీష్ శర్మ, విద్యుత్ గార్గ్ష, ఫీక్ ముస్తఫా, అంజనా బాలాజీ, బి. సాయి దినేష్, శ్రుతి జయన్, గౌరీ మీనన్ కూడా కీలక పాత్రల్లో నటించారు. అప్లాజ్ ఎంట‌ర్‌టైన్‌మెంట్ (Applause Entertainment)తో క‌లిసి కుకునూర్ మూవీస్ (Kukunoor Movies) ఈ సిరీస్‌ను నిర్మించింది.

కాగా..ఈ ‘ది హంట్: ది రాజీవ్ గాంధీ అస్సాసినేషన్ కేస్’ సిరీస్‌ జూలై 4 నుంచి సోనీ లివ్ (Sony LIV) ఓటీటీలో హిందీతో పాటు తెలుగు ఇత‌ర భాష‌ల్లోనూ స్ట్రీమింగ్ కానుంది. రాజీవ్ హ‌త్య అనంత‌రం నిందితుల‌ను ఏవిధంగా ప‌ట‌టుకున్నారు, వాళ్లు ఎంత‌మంది ఉన్నారు, ఎంత‌మందిని ప‌ట్టుకో గ‌లిగారు అనే క‌థ‌తో నిజ జీవిత ఘ‌ట‌న‌ల‌తో రూపొందించారు. ఈ నేప‌థ్యంలో ఇప్ప‌టికే విడుద‌ల చేసిన‌ట్రైల‌ర్ సిరీస్‌పై ఆస‌క్తి పెంచింది కూడా. అయితే ఈ కేసుని ఛేదించే క్రమంలో SITకి నాయకత్వం వహించిన D.R. కార్తీకేయన్ పాత్ర పోషించిన‌ అమిత్ సియాల్ (Amit Sial) ఈ షో గురించి ప‌లు ఆస‌క్తిక‌ర విష‌యాలు పంచుకున్నారు.

THE HUNT

అమిత్ సియాల్ మాట్లాడుతూ..‘ఒక నటుడికి ఇలాంటి ఓ గొప్ప పాత్రను పోషించే అవకాశం రావడం అదృష్టమ‌ని అన్నారు. కార్తీకేయన్ లాంటి గౌరవప్రదమైన, దృఢ నిశ్చయం ఉన్న వ్యక్తి పాత్రను ఎంతో బాధ్యతతో పోషించాన‌ని తెలిపారు. ఇది కేవలం రాజకీయ థ్రిల్లర్ సిరీస్ మాత్ర‌మే కాద‌ని అన్నారు. నాడు.. కార్తికేయన్ పేలుడు జరిగిన ప్రదేశాన్ని సందర్శించే క్షణంలో అక్కడ శరీరం కనిపించ లేదని, ఎండిన రక్తం గుర్తులు మాత్రమే ఉన్నాయ‌ని, క‌డ‌సారి చూపు లేకుండా ఒక విలువైన వ్య‌క్తిని కోల్పోవడం హృద‌యాన్ని క‌లిచి వేసే ఘ‌ట‌న అని అన్నారు.

Updated Date - Jul 02 , 2025 | 10:12 AM