4 Tales OTT: డిఫరెంట్ కాన్సెఫ్ట్‌తో.. 4 టేల్స్ సిరీస్‌

ABN , Publish Date - Oct 15 , 2025 | 12:22 PM

‘కథా సుధ’ సిరీస్‌లో భాగంగా ‘4 టేల్స్’ పేరుతో కొత్త ఆంథాలజీని ప్రారంభించింది టీవీ విన్ ఓటీటీ.

4 tales

సినిమాలు సిరీస్‌ల‌తో పాటు ‘కథా సుధ’ అంటూ కొత్త త‌ర‌హా కాన్సెప్టు చిత్రాల‌ను డిజిటల్ స్ట్రీమింగ్‌కు తీసుకువ‌స్తుంది ఈటీవీ విన్ ఓటీటీ. ఈ క్ర‌మంలో ఇప్ప‌టికే పాతిక వ‌ర‌కు మినీ చిత్రాల‌ను అందుబాటులోకి తెచ్చింది. ఇదే కోవ‌లోతాజాగా ‘4 టేల్స్’ అంటూ మ‌రో వైవిధ్య‌భ‌రిత చిత్రాన్ని ప్రేక్ష‌కుల ఎవదుట‌కు తీసుకు వ‌చ్చింది. నాలుగు ఆదివారాలు, న‌లుగురి క‌థ‌లు, 4 ఎమోషన్స్ అనే డిఫరెంట్ కాన్సెప్ట్ తో ఒక వైవిధ్యమైన ఆంథాలజీ సీరీస్‌ని మంగ‌శారం నుంచి స్ట్రీమింగ్‌కు తీసుకొచ్చింది. అయితే ‘4 టేల్స్’ చిత్ర ట్రైలర్ ని దిగ్గజ దర్శకులు ఆర్జీవీ, హరీష్ శంకర్, ప్రముఖ మ్యూజిక్ డైరక్టర్ జి.వి.ప్రకాష్ లాంచ్ చేయడం విశేషం.

ఇందులో భాగంగా ఈ వారం ‘4 టేల్స్’ లోని మొదటి కథ ‘ది మాస్క్’ ని ప్రీమియర్ చేయడం జరిగింది. క‌థ విష‌యానికి వ‌స్తే.. ఈజీ మనీ కోసం క్రికెట్ బెట్టింగ్ లో డబ్బులు పోగొట్టుకుని అప్పులపాలైన ఒక యువకుడు, ఆ డబ్బుని తిరిగి చెల్లించడానికి ఒక ఇంట్లో దొంగతనానికి వెళ్లి ఓ ఆపదలో చిక్కుకుంటాడు. అత‌ను ఎలాంటి స‌మ‌స్య‌ల్లో చిక్కుకున్నాడు, ఎలాంటి పరిస్థితుల్ని ఎదుర్కొన్నాడ‌నేది ఈ చిత్ర కథాంశం. ఇంత చిన్న కథాంశంలో సస్పెన్స్, డ్రామా, డార్క్ హ్యూమర్ ని మిళితం చేసి బుల్లి తెరమీద ఒక సినిమాటిక్ ఎక్స్పీరియన్స్ ని ఆవిష్కరించే ప్ర‌య‌త్సం చేశాడు దర్శకుడు.

గ‌తంలో ‘నరుడి బ్రతుకు నటన’ చిత్రానికి దర్శకత్వం వహించిన రిషికేశ్వర్ యోగి సమర్పణలో, ‘కథా గని పిక్చర్స్’ బ్యానర్ పై కొత్తపల్లి సురేష్ దర్శకత్వం వహించి, నిర్మించిన ‘ది మాస్క్’ ఈ ఆదివారం(12-10-2025) నుండే ఈటీవీ విన్ యాప్ లో స్ట్రీమ్ అవుతూ ఉంది. రావన్ నిట్టూరి, గడ్డం శ్రీనివాస్ ప్రధాన పాత్రధారులు నటించారు. ఈ చిత్రానికి ఛాయా గ్రహణం: అక్షయ్ వసూరి, సంగీతం: విశాల్ భరద్వాజ్, ఎడిటింగ్: రిషికేశ్వర్ యోగి, సహా నిర్మాతలు: బేబీ విరాన్ష, దీపిక అలోల, ఎక్షిగ్యూటివ్ ప్రొడ్యూసర్: ద్రువ్ చిత్రణ్.

Updated Date - Oct 15 , 2025 | 06:47 PM