Thamma Ott: రష్మిక 'థామా'.. సైలెంట్‌గా ఓటీటీకి వచ్చేసింది! కానీ.. చిన్న కండీషన్
ABN, Publish Date - Dec 02 , 2025 | 01:13 PM
బాలీవుడ్ హీరో ఆయుష్మాన్ ఖురానా, నేషనల్ క్రష్ రష్మిక మందన్నా (Rashmika Mandanna) పాతల్లో నటించిన హారర్ థ్రిల్లర్ ‘థామా’. ఏ అధికారిక ప్రకటన లేకుండా సైలెంట్‌గా ఓటీటీలోకి వచ్చేసింది. ‘
బాలీవుడ్ హీరో ఆయుష్మాన్ ఖురానా, నేషనల్ క్రష్ రష్మిక మందన్నా (Rashmika Mandanna) పాతల్లో నటించిన హారర్ థ్రిల్లర్ ‘థామా’. మ్యాడాక్ హారర్ కామెడీ యూనివర్స్‌లో భాగంగా అక్టోబర్ 31న ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ సినిమా పాజిటివ్ టాక్ తెచ్చుకుంది. ఇప్పుడు ఏ అధికారిక ప్రకటన లేకుండా సైలెంట్‌గా ఓటీటీలోకి వచ్చేసింది. ‘అమెజాన్ ప్రైమ్ వీడియో’లో ఈ సినిమా స్ట్రీమింగ్ అవుతోంది. హిందీతో పాటు తెలుగులోనూ అందుబాటులో ఉంది. అయితే ప్రస్తుతానికి రెంటెడ్ విధానంలో స్ర్టీమింగ్ అవుతోంది. ఉచితంగా స్ర్టీమింగ్ ఎప్పటి నుంచి అనేది తెలియాల్సి ఉంది. ఆదిత్య సర్పోత్థార్ దర్శకత్వం వహించగా... దినేశ్ విజన్ నిర్మించారు. నవాజుద్దీన్ సిద్థిఖీ, పరేష్ రావల్, వరుణ్ ధావన్, ఆసిఫ్ ఖాన్, సత్యరాజ్ కీలక పాత్రల్లో మెప్పించారు.
కథ:
అలోక్ గోయల్ (ఆయుష్మాన్ ఖురానా - Ayushmann Khurrana) టీవీ ఛానెల్ రిపోర్టర్. ఏదో ఒక సంచలనం సృష్టించి వ్యూవర్స్ అటెన్షన్ ను తన వైపు తిప్పుకోవాలని తపన పడుతుంటాడు. ఓసారి దట్టమైన అడవిలోకి షూట్ కోసం స్నేహితులతో వెళ్ళి, అక్కడ ఎలుగుబంటి దాడికి గురవుతాడు. అతన్ని బేతాళురాలైన తడ్కా (రష్మిక మందన్నా Rashmika Mandanna) కాపాడుతుంది. మానవాతీత శక్తులు కలిగిన బేతాళులకు యక్షాసన్ (నవాజుద్దీన్ సిద్థికి Nawazuddin Siddiqui) అధిపతి. అయితే మనుషుల రక్తం తాగకూడదనే నిబంధనను ఉల్లంఘించడంతో వందేళ్ళ పాటు అతన్ని ఖైదీ చేస్తారు. తమలోని ఒకరు మనిషి రక్తం తాగితే... అతనికి విమోచన జరిగి, ఆ వ్యక్తి ఖైదీ కావాల్సి ఉంటుంది. అలోక్ మీద ప్రేమ పెంచుకున్న తడ్కా... అతని కోరిక మేరకు అడవిని వదిలి, సిటీలోకి అడుగు పెడుతుంది. బేతాళురాలైన తడ్కా... నగర జీవితంలో ఎలాంటి ఇబ్బందులు ఎదుర్కొంది? ఆమె కారణంగా బేతాళుడిగా మారిన అలోక్... ఆ జాతికి ఎలా అధిపతి అయ్యాడు? ఈ క్రమంలో భేడియాకు అతనికి మధ్య పోరాటం ఎందుకు జరిగింది? అనేది మిగతా కథ.